120 కోట్ల మనీ ల్యాండరింగ్

ఉగ్రవాద మూలాలను నిర్మించేందుకు భారత్ లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న పీఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలను ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కోర్టులో ఛార్జిషీట్ వేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు పలు సంచలన విషయాలను వెల్లడించారు. పీఎఫ్ఐ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు అహ్మద్, జనరల్ సెక్రటరీ మహ్మద్ ఇలియాస్, ఆఫీస్ సెక్రటరీ అబ్దుల్ ముకిత్ లను నిందితులుగా పేర్కొన్న ఈడీ మొత్తం 120 కోట్ల మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపించింది. హావాలా, డొనేషన్లు, బ్యాంకింగ్, ఛానెళ్లతో పాటు వివిధ రకాల చట్ట విరుద్దమైన దారుల్లో ఈ నగదును సేకరించారని వివరించింది.

మూలాలపై నిఘా…

ఆరు ఉగ్రవాద సంస్థల మిలితంతో ఏర్పడిన పీఎఫ్ఐ సేవా కార్యక్రామల పేరిట దేశంలో పట్టు సాధించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. కేరళలో వేళ్లూనుకపోయిన పీఎఫ్ఐ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతను ఆకర్షించి భారత్ మూలాలను దెబ్బతీసే విధంగా ముందుకు సాగుతోందని, అన్ని రంగాల్లోనూ పీఎఫ్ఐ ప్రతినిధులు ఉండే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకుని ఆ దిశగా ముందుకు సాగుతోందని వివరించాయి. కేరళ కేంద్రంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతను ఆకర్షించి వారికి ఇంట్రస్ట్ ఉన్న రంగాల్లో నిష్ణాతులను చేసి కరుడుగట్టిన సానుభూతిపరులుగా తయారు చేసే పనిలో నిమగ్నం అయినట్టుగా ఐబీ తేల్చింది. సమాజంలో విలువలతో కూడిన ప్రొఫెషన్లలో పీఎఫ్ఐ కార్యకర్తలను భాగస్వాములను చేసి బలమైన శక్తిగా అవతరించాలన్న సంకల్పంతో ముందుకు సాగిందని, ఇందులో భాగంగా కర్నాకట రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల్లో అభ్యర్థులను బరిలో నిలిపినట్టు కూడా గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం అయి పీఎఫ్ఐ మూలాలను వెదికే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో దాడులు చేసి పీఎఫ్ఐ సంబంధాల గురించి సేకరించింది. జగిత్యాలకు చెందిన ఒకరిని కరీంనగర్ లో అరెస్ట్ చేయగా ఇక్కడ ఇంకా ఏమైనా మూలాలు ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీస్తోంది.

విధ్వంసాలతోనే సరికాదని…

పీఎఫ్ఐ ఏర్పాటు చేయడానికి ఉగ్రవాద సంస్థలు ముందు చూపుతో వ్యవహరించాయని కేంద్ర నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే కేవలం విధ్వంసాలకు పాల్పడడం, టార్గెట్లను చంపడంతో సరిపెడితే చాలదని, ఇక్కడి ప్రజల్లో భాగంగా మారిపోయి అన్ని రంగాల్లో పట్టు సాధించాలన్న లక్ష్యంతోనే పీఎఫ్ఐ వ్యూహాత్మకంగా పట్టు నిలుపుకునే విధంగా స్కెచ్ వేసినట్టుగా ఐబీ గుర్తించింది. టెర్రర్ సంస్థలు ఎన్ని ఉన్నా ప్రజలను ఆకర్షించేందుకు అవసరమైన సంస్థలు కూడా ముఖ్యమేనని భావించిన విచ్ఛినకర శక్తులు పీఎఫ్ఐని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాయని, ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను ప్రపంచ వ్యాప్తంగా సమీకరించుకున్నాయని నిఘా వర్గాలు వాదిస్తున్నాయి.

ఐదేళ్ల నిషేధం

పీఎఫ్ఐకి సంబందించిన పూర్తి వివరానలు సేకరించిన ఐబీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో పీఎఫ్ఐని ఐదేళ్ల పాటు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏఢాది సెప్టెంబర్ లో ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధిత సంస్థ కార్యకలాపాలను ఉక్కుపాదంతో తొక్కేయాలని, సంస్థ ఉనికి సమూలంగా నాశనం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర నిఘా వర్గాలు, ఎన్ఐఏ ఇదే పనిలో నిమగ్నం అయింది.

You cannot copy content of this page