రిట్రైవ్ తో వెలుగులోకి వస్తున్న చాటింగ్ బాగోతం…

ఎన్నికల్లో రేవంత్ చర్యల కట్టడికే ప్రాధాన్యం…

దిశ దశ, హైదరాబాద్:

ఎన్నికలకు ముందు అసలేం జరిగింది..? స్పెషల్ ఇంటలీజెన్స్ బ్రాంచ్ ఏం చేసింది..? సంబంధం లేని వ్యవహారాల్లో ఈ వింగ్ ఎందుకు తలదూర్చాల్సి వచ్చింది..? పొలిటిల్ లీడర్ల ఫోన్లను ట్రాక్ చేయడం వెనక ఉన్న అంతర్యం ఏంటీ అన్నదే ఇప్పుడు పోలీసు అధికారులను వెంటాడుతున్న ప్రశ్నలు. అసాంఘీక శక్తులను కట్టడి చేయడం కోసం, ప్రభుత్వాన్ని అస్థిర పర్చే కుట్రల గురించి తెలుసుకునేందుకు మాత్రమే సాధారణంగా నిఘా వర్గాలు ట్యాపింగ్ కు పాల్పడతారన్న ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే విధానం అమలు చేస్తుంటారు కానీ అసాంఘీక శక్తులను కట్టడి చేసేందుకు మాత్రమే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఎన్నికల సమాయంలో ఎస్ఐబీ స్పెషల్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టిందని తేటతెల్లం అవుతోంది.

గుట్టు రట్టు…

ఎస్ఐబీ ఎస్ఓటీ డీఎస్పీగా పనిచేసిన ప్రణిత్ రావు ఎన్నికల సమయంలో నిభందనలు ఉల్లంఘించి మరీ వ్యవహరించినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసు అధికారులు. ఆక్ష్న మొబైల్ రిట్రైవ్ చేస్తున్న క్రమంలో వాట్సప్ ఛాటింగ్ ద్వారా ఒక్కో విషయం బయట పడుతోంది. పెద్దపల్లి, ములుగులో డబ్బులు పంచేందుకు ఎవరు వెల్తున్నారు…? రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కో ఆర్డినేట్ చేస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నట్టుగా చాటింగ్ రిట్రైవ్ తో వెలుగులోకి వచ్చింది. మీడియాలో పని చేస్తున్ ఒకరు రూ. 3 కోట్లు రేవంత్ రెడ్డికి అరేంజ్ చేశారని, రవాణా వ్యాపారంలో ఉన్న ఆయన లారీలను కూడా సమకూర్చుతాడన్నవిషయాన్ని కూడా ఛాటింగ్ ద్వారా చేసుకున్నారు. రేవంత్ రెడ్డి వద్ద పనిచేస్తున్న నగేష్, మల్లేష్ అనే వ్యక్తి కరీంనగర్ కు డబ్బులు చేరవేస్తున్నారన్న విషయంపై కూడా చాటింగ్ చేసుకుని నిఘా కట్టుదిట్టం చేసినట్టుగా స్పష్టం అవుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుని ఆదేవాలతోనే ప్రణిత్ రావు ఫోన్ ట్యాపింగుకు పాల్పడ్డాడని, రేవంత్ రెడ్డిని కలుస్తున్న వారి వివరాలు సేకరించిన బీఆర్ఎస్ నేత ఒకరు ఏకంగా 100 మొబైల్ నంబర్లు ప్రణిత్ రావు వాట్సప్ కు పంపి ట్రాకింగ్ చేయాలని కోరినట్టుగా కూడా తేలింది. ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ప్రణిత్ రావు సదరు వ్యక్తులు ఎవరెవరిని కలుస్తున్నారు, ఆర్థిక లావాదేవీలు ఏంటీ అన్న వివరాలను సేకరించి బీఆర్ఎస్ నేతకు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఛానల్ అధిపతి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సమాచారం ఇచ్చినట్టుగా నిర్దారించిన పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకునే విషయంపై దృష్టి సారించినట్టుగా సమాచారం. ఎఫ్ఐఆర్ లో ప్రణీ్త్ రావుచే ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిన అధికారులతో పాటు మీడియా సంస్థలకు చెందిన వారి పేర్లను కూడా చేర్చనున్నట్టుగా తెలుస్తోంది.

ఎన్నికల‘కోడ్’..?

అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఈసీఐ ఆదేశాలను అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు నడుచుకోవల్సి ఉంటుంది. ఆయా శాఖల అధికారులు రాజకీయ పార్టీల ప్రలోభాల్లో చిక్కుకోకుండా ఎన్నికల నిభందనలు అమలు చేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ఇంటలీజెన్స్ వింగ్ మాత్రం ఇందుకు అనుగుణంగా నడుచుకోకపోవడం విడ్డూరంగా మారింది. అన్ని రాజకీయ పార్టీల కార్యకలాపాలపై నిఘా వేసి నిభందనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై ఎన్నికల సంఘానికి నివేదికలు పంపించాల్సి ఉంటుంది. కానీ ప్రణిత్ రావు ఛాటింగ్ వ్యవహారాన్ని గమనిస్తే మాత్రం వారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టుగా వెల్లడవుతోంది. ఇందులో ప్రధానంగా ఎస్ఓటీ ఇంచార్జిగా మాత్రమే వ్యవహరించిన ప్రణిత్ రావు ఆయనపై అధికారులు ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పురమాయించి ఉంటారన్న అనుమానలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో పాటు అధికార పార్టీ నాయకులు కూడా ప్రణిత్ రావుకు టెక్నాలజిపై ఉన్న పట్టును గమనించి పూర్తిస్థాయిలో వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సమయంలో కూడా అధికార పార్టీకి సంబంధించిన లావాదేవీలను ఎస్ఐబీ పరిశీలించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిభందనల మేరకు కూడా బాధ్యులపై చర్యలు తీసుకుంటారా లేక క్రిమినల్ చర్యలతోనే సరిపెడ్తారా అన్న విషయంపై పోలీసు విభాగంలో తర్జనభర్జనలు సాగుతున్నాయి.

You cannot copy content of this page