ఫోర్న్ సైట్స్ వీడియోలే అవి
తవ్విన కొద్ది కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ కేసులో. హనీ ట్రాప్ చేసి ప్రముఖుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాల గుట్టు రట్టు చేసే పనిలో పోలీసులు రంగంలోకి దిగారు. న్యూడ్ గా వీడీయో కాల్స్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న తీరుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడం ఆరంభించారు.
జరిగింది ఇది….
ఇందులో తొలి అడుగు వేసిన పోలీసులు కొన్ని ముఠాలు న్యూడ్ కాల్స్ చేయకుండా పోర్న్ సైట్ప్ నుండి వీడియోలను ప్రదర్శిస్తూ బ్యాక్ గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ భారీ స్కెచ్ తోనే నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు గుర్తించిన కొత్త విషయంపై పూర్తిగా స్టడీ చేసిన ఓ నిర్దారణకు రానున్నారు. అయితే వీడియో కాల్స్ ఎలా చేస్తున్నారు, ఇందు కోసం ఛీటింగ్ గ్యాంగ్స్ ఏ విధంగా స్కెచ్ వేస్తున్నాయి అన్న విషయాలపై కూడా ఓ నిర్దారణకు వచ్చారు. యువతులు న్యూడ్ గా మారి నేరుగా వాట్సప్ వీడియో కాల్స్ చేయడం లేదని పోర్న్ సైట్స్ వీడియోలను ప్లే చేస్తూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ట్రాప్ చేస్తున్నారని సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ముందుగా వేరే ఫోన్ లో పోర్న్ సైట్స్ వీడియోలు ప్లే చేస్తూ మరో ఫోన్ తో వీడియో కాల్ చేసి పోర్స్ సైట్ కు సంబందించిన న్యూడ్ కాల్స్ వీడియోలను ప్లే అయ్యే విధంగా సెట్ చేస్తున్నారు. వీడియో కాల్ చేసి నేరుగా అమ్మాయిలు మాట్లాడుతూ పోర్న్ సైట్ వీడియోలు ప్లే అవుతున్న విషయం గమనించకుండా బాధితులు వారి ట్రాప్ లో పడిపోతున్నారు. ఈ సమయంలో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చే యువతులు టార్గెట్ చేసుకుని కాల్స్ చేసిన వారి వీడియోలను రికార్డు చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్టు పోలీసులు నిర్దారించారు. పోర్న్ సైట్ వీడియోలకు, బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లిప్ మూవ్ మెంట్ కు పోలీక లేకపోవడంతో ఇలాంటి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి అసలు విషయాన్ని పోలీసులు గుర్తించారు. పోర్న్ సైట్ వీడియోలకు అనుగుణంగా వీడియో కాల్ చేసి ఎదుటి వారిని న్యూడ్ గా మారాలని చెప్తు, కవ్వింపులకు గురి చేసే విధంగా మాట్లాడుతూ వారిని ట్రాప్ చేస్తున్నారు. హనీ ట్రాప్ ద్వారా దేశ వ్యాప్తంగా ప్రముఖులను టార్గెట్ చేసి రూ. కోట్లు వసూలు చేస్తున్న ముఠాలు కూడా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ మహానగరంలో కూడా హనీ ట్రాప్ క్రైమ్స్ తీవ్రంగా పెరగడంతో సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముఠాలను కట్టడి చేయకపోతే చాలామంది ఈ వ్యవహారంలో చిక్కుకుంటున్నారని గుర్తించి సైబర్ క్రైం టీమ్స్ దర్యాప్తు లోతుగా చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటి వరకు జరిగిన దాదాపు అన్ని కేసుల్లోనూ ఇదే విధానంతో చీటింగ్ గ్యాంగ్స్ వ్యవహరించాయని తేల్చారు.
మిగిలింది అదే…
వీడియో కాల్స్ చేస్తున్న ముఠాలను గుర్తించి పట్టుకోవడమే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగనున్నారు. హనీ ట్రాప్ వ్యవహారం అంతా కూడా ఇలాగే ఉండడంతో ఈ వ్యవహారాలకు పాల్పడుతున్న ముఠాలను గ్యాంగ్స్ ను గుర్తించేందుకు పోలీసులు శ్రీకారం చుట్టనున్నారు. వారిని టెక్నికల్ గా ఎలా పట్టుకోవాలనన్న అన్వేషణ కొనసాగిస్తూనే మరో వైపున ఫిజికల్ గా కూడా గుర్తించేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. హనీ ట్రాప్ టీమ్స్ గుట్టు రట్టు చేసినట్టయితే నిత్యృత్యంగా మారిన ఈ రకమైన సైబర్ క్రైమ్స్ ను కట్టడి చేసినట్టు అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.