ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే వివేకానంద


దిశ దశ, హైదరాబాద్:

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఈడీ విచారణకు హాజరయ్యారు. హవాలా, ఫెమా కేసుల్లో గురువారం ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల సమయంలో హైదరాబాదులో నమోదైన ఓ కేసులో  విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో వివేక్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్ల వ్యవహారంపై హైదరాబాద్ సిటీ అధికారులు కేసు నమోదు చేశారు. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రవేట్ సెక్యూరిటీ సంస్థలో 8 కోట్ల పైచిలుకు నిధుల డిపాజిట్ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదయింది.  ఈ డిపాజిట్ల సంబంధించి ఆరా తీస్తున్నట్టు సమాచారం.

You cannot copy content of this page