షిఫ్ట్ కారులో వచ్చి షిప్ట్ చేశారు… పందెం కోళ్ల దొంగల అరెస్ట్…

పెద్దపల్లి ఏసీపీ G కృష్ణ

దిశ దశ, పెద్దపల్లి:

కోళ్లను దొంగలించే ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. జిల్లాలోని కాట్నపల్లిలో ఇటీవల చోరీకి గురైన పందెం కోళ్లను ఎత్తుకెళ్లిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కోళ్లను దొంగలిస్తున్న ఈ ముఠా నాటు కోళ్లు, పందెం కోళ్లను చోరీ చేస్తున్నారు. మార్కెట్లో మంచి ధర పలికే కోళ్ల ఆచూకి కోసం పగలు రెక్కి చేసి రాత్రి పూట వాటిని ఎత్తుకెళ్తారు. ఈ నెల 26న జిల్లాలోని సుల్తనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాట్నపల్లిలో చీటి సతీష్ కు చెందిన 20 కోళ్లను ఎత్తుకెళ్లారు. నిందితులను ఏపి7 ఏవి 7659 అనే నెంబరు గల కారుతో పాటు 22 కోళ్లను రికవరీ చేశారు. ఏపీలోని కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన మేచర్ల యేసు బాబు (38)పై ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కోళ్లను ఎత్తుకెళ్లిన ఐదు కేసులు ఉన్నాయన్నారు. గ్యార విష్ణు(26)పై రెండు కేసులు, మేచర్ల కిషోర్(38)పై ఏడు కేసులు ఉన్నాయి. కాట్నపల్లి నుండి కోళ్ల దొంగతనం చేసిన కేసులో ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరంతా కూడా జల్సాలకు అలవాటు పడి కోళ్లను దొంగలించడమే వృత్తిగా పెట్టుకున్నారని పోలీసుల విచారణలో తేలింది.

కోళ్ల కోసం షిప్ట్ కారు…

నిందితులు కోళ్లను దొంగలించేందుకు ప్రత్యేకంగా ఓ కారులోనే సంచరిస్తున్నారు. పగలంతా రెక్కి నిర్వహించి అర్థరాత్రి వేళల్లో మార్కెట్ లో ధర పలికే కోళ్లను ఎంచుకుని వాటిని ఎత్తుకెల్తుంటారు. ఏపీలో సంక్రాంతి సమయంలో జరిగే పందెం కోళ్లను పోషకాలతో యజమానులు పెంచి పోషిస్తుంటారు. ఈ కోళ్లను దొంగలించినట్టయితే ధర కూడా బాగా పలుకుతుందని భావించిన ఈ ముఠా ఎక్కువ ధర పలికే కోళ్ల ఆచూకి దొరకబట్టేందుకు పగటిపూట అన్వేషణ చేస్తారు. అర్థారాత్రి సమయంలో వాటిని అదే కారులో ఎత్తుకెళ్తుంటారు.

You cannot copy content of this page