కండక్టర్, నర్సు చొరవతో సుఖ ప్రసవం…

దిశ దశ, గద్వాల:

పల్లె వెలుగు బస్సులో ఓ బాలింతకు సుఖ ప్రసవం చేశారు. కండక్టర్, నర్సు చొరవతో పౌర్ణమి రోజున ఓ తల్లి పండండి బిడ్డకు జన్మనిచ్చింది. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం గద్వాల ఆర్టీసీ డిపో బస్సులో సంధ్య అనే గర్భిణీ ప్రయాణం చేస్తున్నారు. వనపర్తి మార్గంలో వెల్తున్న ఈ బస్సులో బయలుదేరిన ఆమె తన సోదరులకు రాఖీ కట్టాలని భావించారు. అయితే మార్గ మధ్యలో సంధ్యకు పురిటి నొప్పులు వస్తున్న విషయాన్ని గమనించిన కండక్టర్ జి భారతి బస్సును ఆపాలని డ్రైవర్ కు సూచించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సాయంతో గర్భిణీకి పురుడు పోశారు. సంధ్య పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత 108 ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అమ్మతనం అంటే ఇదే…

గద్వాల, వనపర్తి రూట్ లో ప్రయాణిస్తున్న సంధ్య పరిస్థితిని గమనించి డెలివరీ చేసేందుకు సాహసించిన కండక్టర్ భారతిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఓ వైపున ప్రయాణీకులకు టికెట్లు ఇస్తూనే నిండు చూలాలు అయిన సంధ్యను గమనించి ఆమెకు నొప్పులు వస్తున్నాయని గమనించి, చొరవ తీసుకున్న తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనందించారు. మానవత్వం చాటుకున్న భారతిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమయ స్పూర్తితో వ్యవహరించడం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని కితాబిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు సామాజిక స్పూర్తితో వ్యవహరిస్తున్న తీరు సంస్థకు గర్వకారణమని ఆర్టీసీ ఉండీ విసి సజ్జనార్ అన్నారు. 

You cannot copy content of this page