టాటాలో ఉద్యోగాల జాతర…
యాపిల్ కంపెనీ దృష్టి చైనా నుండి భారత్ వైపు మళ్లింది. దీంతో ఐఫోన్ విడి భాగాల తయారీ కోసం టాటా గ్రూప్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేఫథ్యంలో టాటా కంపెనీలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అయితే ఈ ఉద్యోగాలన్ని కూడా మహిళలకేనని తెలుస్తోంది. 45 వేల ఉద్యోగాల్లో మహిళలనే నియమించేందుకు టాటా కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రానున్న 18 నుండి 24 నెలల కాలంలో ఈ నియామక ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. యాపిల్ కంపెనీ చైనా నుండి తరలించాలని సిద్దమవుతున్న తరుణంలో ప్రత్యామ్నాయంగా భారత్ కనిపిస్తోందని, ఈ మేరకు తమిళనాడులోని హోసూర్ ఇండస్ట్రీలో ఉద్యోగుల సంఖ్యనే పెంచాలన్న యోచనలో టాటా నిమగ్నం అయిందని బ్లూమ్ బర్గ్ నివేదికలో వెల్లడించింది.