చైనాలో జనాభా సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో జనాభా పెంచేందుకు చైనా ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుంది. ఇప్పటికే ఒకే బిడ్డ విధానాన్ని సడలించి నిర్ణయం తీసుకుంది. అలాగే పలు పన్ను రాయితీలు ప్రకటించింది. అయినప్పటికీ జనాభా పెరగకపోవడంతో చైనా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ‘బ్రైడ్ ప్రైస్’ను రద్దు చేసింది. త్వరగా వివాహాలు చేసుకోవడంతో పాటు ఎక్కువ మంది పిల్లలను కనే అవకాశం ఉందని భావిస్తుంది.
అయితే పెళ్లి సమయంలో అబ్బాయిలు అమ్మాయిలకు కట్నం ఇవ్వడం ఇక్కడి సంప్రదాయం. వివాహ వేడుకలు ఏడాది పొడవునా జరుగుతాయి. అంతే కాకుండా పెళ్లి విషయంలో చాలా ఖర్చు అవుతుంది. దీంతో చాలా మందికి పెళ్లిళ్లు జరుగడం లేదు. ఈ క్రమంలో ఈ సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు చైనా ప్రభుత్వం వివాహం చేసుకోకుండానే పిల్లలను కనేందుకు ఆమోదం తెలిపింది.
జనాభా పెంచేందుకు చైనా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేసుకుంటుంది. దీని కోసం అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. మరోవైపు మహిళా దినోత్సవం సందర్భంగా చైనా ప్రభుత్వం చాలా చోట్ల సామూహిక వివాహాలను నిర్వహిస్తుంది. ఇప్పుడు వివాహం చేసుకోకుండా పిల్లలు కన్న వారికి ప్రసూతి సెలవులు, వైద్య ఖర్చులను అందించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ సౌకర్యాలు ఇప్పటివరకు వివాహమైన జంటలకు మాత్రమే అందుబాటులో ఉంది.
సిచువాన్ చైనాలో 5వ అతిపెద్ద ప్రావిన్స్. ఇక్కడ జనాభా ఎనిమిదిన్నర మిలియన్లు. ఇటీవల ఈ సంఖ్య భారీగా తగ్గుతుంది. తాజా నిర్ణయంతో సిచువాన్ ప్రావిన్స్ దేశంలో మిగతా ప్రాంతాల కంటే ఓ అడుగు ముందుకు వేసింది. సిచువాన్‌లో పిల్లల సంఖ్యపై ఉన్న అన్ని పరిమితులను తొలగించింది. పెళ్లి చేసుకొని పిల్లలు కనే వారికి వేతనంతో కూడిన సెలవు ఇస్తుంది. గతంలో చైనాలో వివాహానికి మూడు రోజుల వేతనంతో కూడిన సెలవులు మాత్రమే ఉండేవి.