బలగం’ సినిమా బృందానికి ‘చిరు’ సన్మానం

ఏదైనా సినిమా నచ్చితే.. అది చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందిస్తుంటారు. సినిమాను తెరకెక్కించిన వారికి ఫోన్ చేసి అభినందించడమో.. లేదా వారిని ఇంటికి పిలిపించి అభినందిస్తుంటారు. తాజాగా దిల్ రాజు ప్రొడక్ష‌లో దర్శకత్వంలో రూపొందిన ‘బలగం’ సినిమా చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందించారు. బలగం మూవీ బృందాన్ని భోలా శంకర్ సెట్స్‌కు పిలిపించి వారిని సన్మానించాడు. అందరినీ పేరు పేరునా పలకరించిన చిరు.. దర్శకుడు వేణును ప్రత్యేకంగా అభినందించాడు.

సినిమాను చక్కగా రూపొందించావంటూ వేణును ప్రశంసించారు. నువ్వు సినిమా ఇంత బాగా తీసి మాకు షాకులు ఇస్తే ఎలా చెప్పు అంటూ శాలువా కప్పి వేణును చిరు సత్కరించాడు. ఈ సమయంలో వేణు, చిరు కాళ్లు మొక్కి మెగాస్టార్ అశీర్వాదం తీసుకున్నాడు. నిజాయతీ ఉన్న సినిమా బలగం. కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నా గానీ సినిమాలో నిజాయతీ ఉంది. వేణు నిజాయతీగా తీశాడు. మంచి నేటివిటీ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చూపించాడు. అతను చిన్నతనం నుంచి చూసిన ప్రతిదీ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయింది. ఒకసారి జబర్దస్త్‌లో ఒగ్గు, బుర్ర కథలు వంటివి తీసుకుని స్కిట్ చేశాడు. నేను అది చూశా. చాలా బాగా చేశాడు. అప్పటి నుంచి అతని మీద గౌరవం పెరిగింది. అతనిలో అంత టాలెంట్ ఉందా? అనుకున్నా. ఈ సినిమా చూసిన తర్వాత… గొప్పగా తీశాడని అనుకున్నా అని చిరంజీవి చెప్పారు.

దీనికి సంబంధించిన వీడియోను హాస్య నటుడు ప్రియదర్శి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘చిరంజీవి అన్నయ్యా.. మీ సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. అలాంటిది ఈ రోజు మీ పక్కన నిల్చొని మీ ప్రేమను, మద్దతును పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. బలగం సినిమా కోసం మీరు చేసిన ప్రతి దానికి ధన్యవాదాలు. ఏదో ఒక రోజు మీతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నా’ అని ప్రియదర్శి రాసుకొచ్చారు. ఇంతకుమించి ఇంకేం కావాలి అని దర్శకుడు వేణు ట్వీట్ చేశారు. 20 ఏళ్ల సినీ జీవితంలో మరచిపోలేని రోజును చిరంజీవి ఇచ్చారు. ఈ క్షణాలను జీవితాంతం మరచిపోలేను. థ్యాంక్యూ సో మచ్‌ సర్‌. ఇది నా బలగం విజయం. ఎప్పటికీ రుణపడి ఉంటా అంటూ వేణు ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

You cannot copy content of this page