పెంపుడు కుక్కల కోసం చర్చ్.. బారులు తీరుతున్న జనం

మనలో చాలా మందికి ఇంటిలో పెట్స్‌ని పెంచుకోవడం అంటే ఇష్టపడతారు. వాటిని కూడా తమలో ఒకరిలా చూసుకుంటూ.. బట్టలు వేస్తారు, బెడ్ ఏర్పాటు చేస్తారు. దానిని ఒక జీవిలా కాకుండా మనిషిలా కలుపుకుని వారితో పాటే సమానంగా కుక్కల్ని, పిల్లు్ల్ని పెంచుతారు. వాటికి ఏమన్న అయితే తట్టుకోలేరు. వాటికి నయం కావాలని దేవుళ్లకి పూజలు కూడా చేస్తారు. అదే విధంగా స్పెయిన్‌లో ఓ విచిత్ర సంఘటన జరుగుతుంది. తమ పెంపుడు కుక్కలకు దేవుడి ఆశీర్వాదం కోసం ఏకంగా చర్చలో జనం బారులు తీరుతున్నారు జనం. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో ఓ చర్చి ఉంది. అక్కడకు జనవరి 17వ తేదీన వేలాది మంది ప్రజలు దేవుడి ఆశ్వీర్వాదం కోసం తమ పెంపుడు జంతువులతో పోటెత్తారు. దీనిని సెయింట్ ఆంథోని డేగా జరుపుకుంటారు. ఈయనను జంతువుల రక్షకుడిగా విశ్వసిస్తారు. అందుకే వారంతా తమ పెంపుడు కుక్కలు, పిల్లులు, ఇతర అన్ని రకాల జంతువులతో చర్చి ముందుకు వచ్చి ఆ దేవుడి ఆశీర్వాదాలను తమ జంతువులకు ఇప్పిస్తుంటారు. అయితే అలా వచ్చిన వారిలో ఓ జంతువు యజమానీ ఏం అంటున్నారంటే.. తమ జంతువు ఇటీవలే అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లామని.. కానీ, అక్కడ వైద్యులు తమ పెట్ ఒక్క రోజు కంటే ఎక్కువ బతకడం కష్టమన్నారని చెప్పాడు. అప్పుడే తాము సెయింట్ ఆంథోనిని ప్రార్థించామని.. తమ జంతువు మళ్లీ ఆరోగ్యంగా ఉంటే ప్రతి యేటా చర్చికి వస్తామని మొక్కినట్లు తెలిపాడు. అనంతరం తమ పెట్ అనారోగ్యం నుంచి కోలుకోవడంతో.. ఈ రోజు చర్చికి వచ్చినట్టు తెలిపారు.
కాగా.. ఈ వీడియోలో ప్రజలు తమ పెంపుడు జంతువులను చర్చి పాస్టర్ వద్దకు తీసుకెళ్లగా ఆయన ప్రేయర్ చేస్తూ వాటిని ఆశీర్వదించడం కనపడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
https://twitter.com/ModernEraNews/status/1615626998344187905?s=20&t=lQr7dDKzJJ9c0cafVd19bg

You cannot copy content of this page