దిశ దశ, వరంగల్:
లోకసభ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో బదిలీలకు శ్రీకారం చుడతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఉన్నతాధికారుల నుండి క్షేత్ర స్థాయి అధికారుల వరకు అందరినీ మార్చేస్తారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే పోలీసు విభాగంలో బదిలీలు మొదలయ్యాయి. మల్టిజోన్ 1 పరిధిలోని 13 మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ డీసీఆర్బీలో పని చేస్తున్న ఎం నైలు భైంసా రూరల్ కు, అక్కడ పని చేస్తున్న ముస్కం శ్రీనివాస్ ఐజీ కార్యాలయానికి, నిర్మల్ స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న ఎం ప్రవీణ్ కుమార్ ను నిర్మల్ టౌన్ కు, అక్కడ పని చేస్తున్న బి అనిల్ రామగుండం ట్రాఫిక్ 2కు బదిలీ అయ్యారు. వీఆర్ లో ఉన్న బత్తుల సత్యనారాయణ కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు, అక్కడ పనిచేస్తున్న కర్ణాకర్, రామగుండం ట్రాఫిక్ 2 సీఐ బొంతల సత్యనారాయణలను ఐజీ కార్యాలయానికి, ఖమ్మం సీఎస్బీ 3 సీఐగా పనిచేస్తున్న కె సతీష్ ను పాల్వంచ టౌన్ కు, ఇక్కడ పనిచేస్తున్న వినయ్ ఐజీ ఆఫీసుకు, రామగుండం సీఎస్బీ 4 సీఐగా పనిచేస్తున్న రమేష్ బాబును అదే కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ కు, ఖమ్మం డీటీసీ సీఐ పి వెంకన్న, మల్టిజోన్ 1 ఐజీ ఆపీసులో వెయిటింగ్ లో ఉన్న కె దామోదర్ లు వరంగల్ కమిషనరేట్ కు, ఐజీ ఆఫీసులో ఉన్న ఎం రమేష్ నిజామాబాద్ సీసీఎస్ 1కు బదిలీ అయ్యారు.