దిశ దశ, కోరుట్ల:
జగిత్యాల జిల్లాలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కోరుట్లలో సీఐడీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుండే ప్రారంభం అయిన ఈ సోదాల్లో గల్ఫ్ ఏజెంట్లకు సంబంధించిన కార్యాలయాలు, వారి ఇండ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేసి వీసాలపై విదేశాలకు పంపిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లడంతో సీఐడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. గల్ఫ్ ఏజెంట్లు ఇప్పటి వరకు విదేశాలకు పంపించిన వారి వివరాలతో పాటు ఇతరాత్ర రికార్డులను కూడా సీఐడీ బృందాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చిన సీఐడీ టీమ్స్ ఈ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఆయా గల్ఫ్ ఏజెంట్ల నుండి వివరాలతో పాటు డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.