చినుకుల చిటపట నడుమ తుపాకుల తూటా మోత…

బీజాపూర్ లో ఎదురుకాల్పులు…

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకులు తూటాలు కక్కాయి. ఓ వైపున వాన నీటి చినుకుల సవ్వడులు.. మరో వైపున పోలీసులు, నక్సల్స్ చేతుల్లోని తుపాకుల మోతలతో అటవీ ప్రాంతం దద్దరిల్లిపోయింది. శనివారం తెల్లవారు జామున బీజాపూర్ జిల్లాలోని పోతేనార్ జంగిల్ పహార్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడి అటవీ ప్రాంతంలో భైరామ్ గడ్ ఏరియా కమిటీకి చెందిన 10 నుండి 15 మంది మావోయిస్టులు షెల్టర్ తీసుకుని ఉన్నారన్న సమాచారం మేరకు డీఆర్జీ బలగాలు, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్ 222 బెటాలియన్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టుల ఏరివేత కోసం పోతేనార్ జంగిల్ పహార్ అటవీ ప్రాంతంలోకి చేరుకున్న బలగాలకు, నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. అయితే అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page