సుక్మాలో ఎదురు కాల్పులు: నలుగురు నక్సల్స్ కు గాయాలు..?

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్ అడవుల్లో మళ్లీ ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జాము నుండి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ ఘటనలో నలుగురు నక్సల్స్ గాయపడినట్టు ప్రాథమిక సమాచారం. సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో డీఆర్జీ బలగాలకు, మవోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు సాగుతున్నాయి. శనివారం ఉదయం నుండి ఫైరింగ్ కొనసాగుతున్న ఈ ఘటనలో నలుగురు నక్సల్స్ గాయపడినట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి. ఎదురు కాల్పుల్లో దళ కమాండర్ మంగడు కూడా గాయపడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. ఎదురు కాల్పులు జరుగుతున్న విషయన్ని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ దృవీకరించారు.

ముగ్గురు లొంగుబాట

ఓ వైపున మావోయిస్టుల ఏరివేత కోసం బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే మరో వైపున లొంగుబాటును కూడా ప్రోత్సహిస్తున్నారు. మావోయిస్టులు లొంగుబాట పట్టి జనజీవనంలో కలవాలన్న పిలుపుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు సుక్మా జిల్లా పోలీసు యంత్రాంగం ఇందులో భాగంగా బెజ్జీ ప్రాంతానికి చెందిన ముగ్గురు నక్సల్స్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. మావోయిస్టులు సరెండర్ అయిన విషయం వాస్తవమేనని సుక్మా ఎస్సీ మీడియాతో అన్నారు.

You cannot copy content of this page