లేచిన చేతులు… విరిగిన కుర్చీలు…

దిశ దశ, ఆసిఫాబాద్:

బీసీ కుల గణన కార్యాచరణ సమావేశంలో కాంగ్రెస్ క్యాడర్ ప్రచ్ఛన్న యుద్దానికి తెరలేపింది. తమను ఆహ్వానించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యర్థి వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. అధికార పార్టీ నాయకులు మధ్య జరిగిన వాగ్వాదం చివరకు కుర్చీలు విసురుకునే పరిస్థితికి చేరింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం బీసీ కుల గణన కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదంటూ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి శ్యాంనాయక్ వర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. సమావేశానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ నాయకుడిని ఎందుకు ఆహ్వానించలేదంటూ ఆందోళన చేపట్టాయి. సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని వారించినా కట్టడి కాలేకపోయింది. సమావేశం నుండి శ్యాం నాయక్ వర్గాన్ని బయటకు తరలించేందుకు పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ కావాలనే అసెంబ్లీ ఇంఛార్జిని పిలవలేదంటు కార్యకర్తలు మండిపడ్డారు. డీసీసీ అధ్యక్ష్య పదవి నుండి విశ్వ ప్రసాద్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page