ఎర్రవెల్లిలో నైట్ హాల్ట్…
దిశ దశ, కరీంనగర్:
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పర్యటన రద్దయింది. సాయంత్రం 5 గంటల వరకు రోడ్డు మార్గం గుండా కరీంనరగ్ చేరుకుని ఉత్తర తెలంగాణ భవన్ లో బస చేయనున్నారని గురువారం మద్యాహ్నం సీఎంఓ నుండి సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు కూడా హుటాహుటిన ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నం అయ్యారు తీగలగుట్టపల్లిలోని సీఎం నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో పాటు రహదారులన్ని కూడా కాఖీలతో నిండిపోయాయి. మరో వైపున జిల్లా అధికార యంత్రాంగం కూడా సీఎం టూర్ ఫిక్సయిన నేపథ్యంలో అప్రమత్తం అయ్యారు. సీఎం పర్యటించే అవకాశాలు ఉన్న రహదారులను శుభ్రం చేయించడం, రహదారిపై గతంలో నాటిన మొక్కలను పరిశీలించడం తదితర పనుల్లో నిమగ్నం అయ్యారు. అయితే 4.30 గంటల ప్రాంతంలో సీఎం కరీంనగర్ వచ్చే పర్యటనను రద్దు చేసుకున్నట్టు జిల్లా అధికారులకు సమాచారం అందింది. గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్, తెలంగాణ కళాకారుడు సాయి చంద్ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఇతరాత్ర కార్యక్రమాలు ముగిసే వరకు ఆలస్యం కావడంతో కరీంనగర్ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు రాత్రి వరకు ఆయన ఎర్రవెల్లి ఫాం హౌజ్ కు చేరుకుని బస చేయనున్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర పర్యటన మాత్రం యథావిధిగా కొనసాగనుంది. ఎర్రవెల్లి నుండి హెలిక్యాప్టర్ లో సీఎం కుమరం భీం ఆసిపాబాద్ జిల్లా ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన అనంతరం పోడు భూముల పట్టాలు ఇవ్వనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post