ఆలయాల సందర్శనలో శోభమ్మ

దిశ దశ, ఏపీ బ్యూరో:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సతీమణి శోభమ్మ ఆలయాల సందర్శనలో బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం తిరుమల వెంకన్న సన్నిధిలో తల నీలాలు ఇచ్చి దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీ కాళహస్తీలోని శ్రీ కాళహస్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన క్రమంలో ఆమె ఒక్కరే ప్రముఖ క్షేత్రాలను దర్శించుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం కేసీఆర్ లేకుండా శోభమ్మ ఒక్కరే టూర్లు చేసిన సందర్భాలు అత్యంత అరుదు. గతంలో కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకునేందుకు తనయ కవితతో వెళ్లని శోభమ్మ ఇప్పుడు మాత్రం ఒక్కరే ఆలయాల బాట పట్టడం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థకు గురైన కారణంగా ఆమె ఒక్కరే మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లారని అంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఉన్నట్టుండి ఎన్నికలకు ముందు శోభమ్మ ప్రసిద్ద క్షేత్రాల సందర్శన కార్యక్రమం నిర్వహిస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page