వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్రమాదం

ముగ్గురికి గాయాలు

దిశ దశ, వరంగల్:

వరంగల్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణీకులు గాయపడ్డారు. విజయవాడ వైపునకు వెల్లే ట్రైన్ కోసం ఫస్ట్ ప్లాట్ ఫారం వద్ద వెయిట్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో స్టేషన్ పై భాగంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూలిపోయి ప్లాట్ ఫారం రేకులపై పడింది. దీంతో ప్లాట్ ఫాం రేకులు విరిగి పడడంతో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న రామ బ్రహ్మం, కిషన్ రావు, హరీష్ లకు గాయాలయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన వీరిలో హరీష్ చికిత్స పొందిన తరువాత డిశ్చార్జి అయి వెల్లిపోగా రామబ్రహ్మం, కిషన్ రావులు మాత్రం ఆసుపత్రిలో చేరారు.

అలా జరిగితే…

అయితే వరంగల్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటనలో వాటర్ ట్యాంకు నుండి ప్లాట్ ఫాంపైకి పెద్ద నీరు వచ్చి చేరింది. పై నుండి నీరు కిందకు జారడంతో వరద ఉధృతి కారణంగా కొంతమంది ప్రయాణీకులు కొట్టుకపోయి ట్రాక్ పై కూడా పడిపోయినట్టుగా ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. ఈ సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా రైళ్ల రాకపోకలు లేకపోవడంతో ట్రాక్ పై పడిపోయిన ప్రయాణీకులు సేఫ్ అయ్యారని లేనట్టయితే ప్రాణ నష్టం కూడా సంభవించేదని తెలుస్తోంది.

You cannot copy content of this page