దిశ దశ, మహదేవపూర్:
మహదేవపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అభినందించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లో పర్యటించిన ఆయన వివిధ ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా బాలికల హైస్కూల్ లో విద్యార్థుల ఇన్నోవేటివ్ విధానాలను ప్రత్యక్ష్యంగా తిలకించారు. ఫేస్ ఎక్స్ ప్రెషన్ కోడ్, ఐ కోడింగ్ తో పాటు వివిధ రకాల విధానాలను విద్యార్థులు ప్రదర్శించారు. ప్రపంచంలోనే ఎవరూ చేయలేని పద్దతులతో కోడింగ్ విధానాలను క్రియేట్ చేయడం పట్ల కలెక్టర్ విద్యార్థులను అభినందించారు. ఇలాంటి నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పాఠశాలలో మౌళిక వసతులకు సంబంధించిన పనులు చేపట్టాలని ఆదేశించారు.