కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తోంది: మంత్రి శ్రీధర్ బాబు

దిశ దశ, మానకొండూరు:

జ్యోతిష్మతి కాలేజీ స్టూడెంట్ అభిలాష్ మిస్సింగ్, శవమై తేలిన ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరు సమీపంలో అభిలాష్ కుటుంబ సభ్యులను కలిశారు. అల్గునూరు క్రాసింగ్ సమీపంలో ఉంది వ్యవసాయ బావిలో అభిలాష్ మృతదేహం లభ్యం. అయితే ఆయన తల లేకుండా మొండెం మాత్రమే దొరకడంతో అన్వేషణ కొనసాగుతోంది. స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబు బాధిత కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల రక్షణ పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవల్సి కార్యక్రమం. ఈ కాలేజీ యాజమాన్యం ఈ నిర్లక్ష్యం వల్లే అభిలాష్ మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా బాధ్యతతో మెదలాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో పోలీసులు కూడా అన్ని కోణాల్లో విచారించి అతనిది హత్య… ఆత్మహత్యనా అనేది తేల్చాలన్నారు. అభిలాష్ కుటుంబానికి అండగా ఉంటామని శ్రీధర్ బాబు ప్రకటించారు.


యాజమాన్యంపై ఫిర్యాదు…

మరో వైపున మృతుడు అభిలాష్ కుటుంబ సభ్యులు సోమవారం ఎల్ఎండీ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. మార్చి1న అభిలాష్ కాలేజీలోకి వచ్చిన తరువాత ఇబ్బందులకు గురి చేయడం వల్లే చనిపోయాడని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కాలేజీ కరస్పాండెంట్ సాగర్ రావు, అతని కొడుకు, వార్డెన్ లే బాధ్యులని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

You cannot copy content of this page