కేసు నమోదు చేసిన పోలీసులు
దిశ దశ, వరంగల్:
ఆకాశాన్నంటిన కూర గాయల ధరలు సామాన్యుడిని అతలాకుతలం చేస్తున్నాయి. వెజిటేబుల్స్ ధరలు చూసి మార్కెట్ వైపు కన్నెత్తి చూడని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు చోరులు తమ హస్త లాఘవాన్ని కూరగాయల షాపులపై ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో కూరగాయలు చోరీకి గురయ్యాయని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. తాజాగా తెలంగాణాలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురు కావడంతో కూరగాయల వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కూరగాయల మార్కెట్ లో లక్ పతి వెజిటేబుల్స్ అమ్మకాలు చేస్తున్నారు. ఎప్పటిలాగానే తన షాపును క్లోజ్ చేసి ఇంటికి వెళ్లిపోయిన తరువాత అర్థరాత్రి ప్రాంతంలో అంగతకులు లోపలకు చొరబడి కూరగాయలు ఎత్తుకెళ్తున్నారని లక్ పతి వివరించారు. 20 కిలోల టమోటా, పచ్చి మిర్చి, శ్యామ గడ్డ, గోరు చిక్కుడుకాయలు ఎత్తుకెళ్లారని లక్ పతి వివరించారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ఓ ట్రాలీ ఆటోలో కూరగాయలు చోరీ చేసుకుని వెల్తున్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు డోర్నకల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post