మాజీ మంత్రి గంగుల ముఖ్య అనుచరుడు… బీఆర్ఎస్ కార్పోరేటర్ పై ఫిర్యాదు: మాజీ

దిశ దశ, కరీంనగర్:

చట్టం ప్రకారం నిందితులను వేటాడేందుకు అభయం ఇచ్చే పోలీసు అధికారులు ఉంటే బాధితులు ధైర్యంగా ముందుకు రావడం సహజం. లేనట్టయితే తమ ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందన్న భయంతో బాధితులు తమ బాధలను దిగమింగుకుంటూ కాలం వెల్లదీస్తారు. ఇంతకాలం ఏం చేసినా చెల్లుతుందన్న ధైర్యంతో అక్రమార్కులు చేసిన దందాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే చెప్పాలి. రాజ్యం మా చేతిలో ఉంది… రాజు, మంత్రి అంతా మా చెప్పు చేతల్లో ఉన్నారన్న ధీమాతో చెలరేగిపోయిన ఘనుల గురించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజా సేవ చేసేందుకు ప్రజా ప్రతినిధులుగా గెలవలేదని, విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడడమే మా లక్ష్యం అన్నట్టుగా వ్యవహరించిన తీరుపై ఇంతకాలం ప్రజలు గుసగుసలాడుకుంటూ కాలం వెల్లదీశారు. కానీ కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి కార్యరంగంలోకి దూకడంతో ఒక్కోక్కరుగా బాధితులు పోలీసు అధికారులు కార్యాలయాల తలుపు తడుతున్నారు.

24 గంటల్లోనే… 

సరిగ్గా 24 గంటల్లోనే మరో బీఆర్ఎస్ కార్పోరేటర్ పై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. బుధవారం కరీంనగర్ పోలీసులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అనుచరుడినని చెప్పుకున్న చీటి రామారావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు అత్యంత సన్నిహితుడనని ప్రచారం చేసుకున్న కార్పోరేటర్ తోట రాములు అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. పోలీసులు బాధితుల పక్షాణ నిలుస్తున్నారన్న ధీమా బాధితుల్లో రావడంతో ఒక్కో బాదితుడు కాఖీలకు తమ గోడు చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. గురువారం సీతారాంపూర్ కు చెందిన తాటిపెల్లి లింగారెడ్డి కరీంనగర్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సూర్య నగర్ లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగారెడ్డికి సీతారాంపూర్ శివార్లలోని సర్వే నెంబర్ 68/Bలో 24 1/2 గుంటల స్థలం ఉంది. ఈ స్థలం సీతారాంపూర్ గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్నందున సర్పంచ్ గా ఉన్నప్పటి నుండే జంగిలి సాగర్ తనను వేదించడం మొదలు పెట్టాడని లింగారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ. 40 లక్షలు తనకు ముట్టజెప్పాలని, లేనట్టయితే 4 గుంటల స్థలాన్ని అయినా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరింపులకు గురి చేసేవాడన్నారు. ఉపాధ్యాయునిగా ఉన్న నీవు నన్నేమి చేయలేవని ప్రభుత్వం మాదేనంటూ పలు మార్లు వార్నింగులు కూడా ఇచ్చాడని లింగారెడ్డి వివరించారు. తాను డబ్బులు ఇవ్వకపోవడంతో ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా తనకు చెందిన 3 గుంటల భూమిలో రోడ్డు నిర్మాణం కూడా చేపట్టాడని తెలిపారు. రోడ్డు ఎందుకు పోశావంటే మంత్రి మా ఇంటి మనిషి మీరు ముఖ్యమంత్రి వద్దకు వెల్లినా నన్నేమి చేయలేరంటూ బెదిరించేవాడని లింగారెడ్డి తెలిపారు. తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని లేనట్టయితే ఎలాంటి పర్మిషన్లు కూడా రాకుండా అడ్డుకుంటానని కూడా జంగిలి సాగర్ బెదిరించాడని వివరించారు. డబ్బులు ఇవ్వనట్టయితే నిన్నేం చేయాలో నాకు తెలుసంటూ కూడా హెచ్చరించాడని బాధితుడు తెలిపారు. చివరకు సాగర్ కూతురు కు రూ. 2 లక్షలు ఫోన్ పే ద్వారా పంపించానని, మిగా రూ. 8 లక్షల నగదు నేరుగా ఇచ్చానని ఫిర్యాదులో వివరించారు. ప్రస్తుతం కార్పోరేటర్ గా ఉన్న జంగిలి సాగర్ వల్ల తనకు ప్రాణ హానీ కూడా ఉందని బాధితుడు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు లింగారెడ్డిని జంగిలి సాగర్ డబ్బులు అడుగుతున్నప్పటి వీడియో ఫుటేజీని కూడా సీపీ కార్యాలయంలో అప్పగించారు.

బాధితుడు లింగారెడ్డికి చెందిన భూమి

మరో నాయకుడిపైనా…

తీగలగుట్టపల్లి కార్పోరేటర్ భర్త, బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు కాశెట్టి శ్రీనివాస్ పై కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై కూడా పోలీసు అధికారులు విచారించేందుకు సమాయత్తం అయినట్టుగా సమాచారం. 

You cannot copy content of this page