Telangan Acb: ఏసీబీ తలుపు తట్టిన బీఆర్ఎస్ కార్పోరేటర్…

స్మార్ట్ సిటీ నిధులపై విచారణ జరపాలని ఫిర్యాదు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు ఇక్కడ బీజేపీ కండువా కప్పుకోగా… బీఆర్ఎస్ కార్పోరేటర్ హైదరాబాద్ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయని సమగ్ర విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని కోరుతూ ఏసీబీ డైరక్టర్ జనరల్ విజయ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ కమల్ జిత్ కౌర్, నాయకుడు సర్దార్ సోహన్ సింగ్. కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో మాత్రమే ఖర్చు చేయాల్సిన స్మార్ట్ సిటీ నిదులతో గ్రామీణ ప్రాంతమైన రజ్వీ చమన్ చౌరస్తా, బొమ్మకల్ చౌరస్తాలలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. రిజిస్ట్రేషన్ నంబర్ 584/81 ఉన్న చైతన్య యూత్ క్లబ్ కోసం వెచ్చించిన నిధుల గురించి ఆ భూమి ఎవరికి చెందినదో కూడా విచారించాలని, R&B గెస్ట్ హౌజ్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని మొదట తయారు చేసిన అంచనాలను రివైజ్ చేసి అదనపు నిధులు కెటాయించారని వారు పేర్కొన్నారు. కార్పోరేషన్ లోని మీటింగ్ హాల్, మునిసిపల్ ఆఫీసును తీర్చిదిద్దడానికి వెచ్చించిన నిధుల్లో కూడా అవతవకులు జరిగాయని, జంక్షన్ల సుందరీకరణ కోసం వెచ్చించిన నిధులు, కలెక్టరేట్ చుట్టూ నిర్మించిన రోడ్డు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో మూడు సార్లు మరమ్మత్తు చేయాల్సి వచ్చిందని, అనధికారికంగా ఏర్పాటయిన వెంచర్లలో కూడా స్మార్ట్ సిటీ నిధులతో సీసీ రోడ్లు వేశారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన నిధులు దుర్వినియోగం అయిన విషయంపై విచారణ జరిపి మేయర్ సునీల్ రావు, అధికారులపై కేసు నమోదు చేయాలని కమల్ జిత్ కౌర్ కోరారు.

You cannot copy content of this page