ఆర్థిక సమస్యలు ఉన్న వారి కోసం ప్రభుత్వాలు ఫీజు రియింబర్స్ మెంట్ వంటివి ఇస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు రంగ సంస్థలు కూడా ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ ఇస్తున్నాయి. ఫిలిప్స్ సంస్థ ఒక అడుగు ముందుకేసి ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులను సపోర్ట్ చేసేందుకు రూ.50వేలు స్కాలర్‌షిప్ వారికి అందించనుంది. దాని కోసం ఫిలిప్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం 2022-23 అప్లికేషన్స్ విడుదల చేసింది. ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవడానికి అర్హులు ఎవరు, అర్హులైన వారు ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి.
అర్హత : వైద్య, ఆరోగ్య సంబంధింత రంగాల్లో చదువుతున్న విద్యార్ధులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ కు అర్హులు. MBBS, BDS, Nursing, B.Pharmsy, BAMS, BHMS ఆరోగ్య సంరక్షణ కోర్సులు చదువుతున్న వారు ఈ ఫిలిప్స్ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవచ్చు.
పైన ఉన్న కోర్సులు చేస్తున్న వాళ్లల్లో ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. మన దేశంలో ఎక్కడ చదువుతున్న వారైనా విద్యలో ప్రతిభావంతులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అయితే అప్లై చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ 70 % శాతం మార్కులు దాటాలి. కాకపోతే కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. ఫిలిప్స్, బడ్డీ ఫర్ స్టడీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు కారు.
దరఖాస్తులకు చివరి తేదీ : ఫిలిప్స్ స్కాలర్ షిప్ 2022-23కు దరఖాస్తులు పెట్టుకోవడానికి 2023 జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి , అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్లో అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి రూ.50,000 స్కాలర్‌షిప్ ఇస్తారు.