దిశ దశ, దండకారణ్యం:
నీటి ప్రవహపు సవ్వడులు వినిపించాల్సిన నది తీరమది… పర్యాటకులతో సందడిగా మారాల్సిన ఆ వాటర్ ఫాల్స్ అది…. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిరసనలు మిన్నంటిపోయాయి. ఎగువ ప్రాంతంలో నిర్మించిన డ్యాంతో దిగువ ప్రాంతానికి నీరు రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకారులు.
ఇంద్రావతి సాక్షిగా నిరసనలు
సోమవారం ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో పూర్వ బస్తర్ జిల్లా వాసులు ఆందోళనలు చేపట్టారు. బస్తర్ ఏరియా మీదుగా ప్రవహిస్తున్న ఇంద్రావతి నదిలో నీరు లేక బోసిపోయిన పరిస్థితి ఏర్పడిందని నిరసనకారులు అంటున్నారు. 2019 నుండే ఇంద్రావతి వికాస్ సాధికరణ్ పేరిట ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన స్థానికులు కొంతకాలం స్తబ్దంగా ఉన్నారు. సోమవారం నుండి తిరిగి కార్యరంగంలోకి దూకడంతో ఇంద్రావతి నది తీరం నిరసనలతో హోరెత్తుతోంది. పర్యాటకులను అన్ని కాలల్లో ఆహ్లదపర్చే చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కూడా నీరు లేక వెలవెలబోతోందని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యవరణ దినోత్సవం నాడు భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టి నిరవధిక నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఉద్యమకారులు నిర్ణయించుకున్నారు. జగ్దల్ పూర్ నుండి బీజాపూర్ వరకు ఉన్న ఇంద్రావతి పరివాహక ప్రాంతాల్లో ఈ నిరసనలు కొనసాగించనున్నారు.
అసలేం జరిగింది..?
బస్తర్ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే ఇంద్రావతి నదికి ఎగువ ప్రాంతంలో ఒరిస్సా ప్రభుత్వం ఇటీవల డ్యాం నిర్మించింది. దీంతో దిగువ ప్రాంతానికి నీరు రావడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోందిన సుమారు 10 టీఎంసీల నీటిని ఈ డ్యాంలో బ్యాక్ వాటర్ స్టోర్ అవుతోందని దీంతో దిగువకు సరిపడా నీరు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
