నిజంగా వారికి ‘పరీక్షే’

గురుకులాల తీరుపై విస్మయం

తొందరపాటు నిర్ణయాలా..?

నిరుద్యోగులతో చెలగాటం…

దిశ దశ, హైదరాబాద్:

ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు పరీక్ష రాయడం కంటే ముందే ‘విషమ పరీక్ష’ ఎదుర్కొంటున్నారు. ఎదో ఒక ఉద్యోగం రాకపోతుందా అన్న ఆశతో సర్కారు ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ చూడడం దరఖాస్తు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది యువతకు. ఇదే ఉద్ధేశ్యంతో గురుకులాల్లో జరుగుతున్న రిక్రూట్ మెంట్ ప్రక్రియపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు ప్రత్యక్ష్య నరకం చూస్తున్నారు. మహిళలు, చిన్న పిల్లల తల్లులు, ప్రెగ్నెన్సీతో ఉన్న వారి గురించి కూడా ఆలోచించకుండా అధికారులు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల తీరు విస్మయం కల్గిస్తోంది. పొంతనలేని విధానాలతో గురుకులాల రిక్రూట్ మెంట్ సాగుతుండడం పట్ల అభ్యర్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సెంటర్ల తీరిలా…

మొత్తం మూడు పరీక్షలకు హాజరు కావాలంటే అభ్యర్థులు స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టుకోవల్సిందే తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితే. ఉదాహరణకు… ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లాలోని సరిహద్దు గ్రామానికి చెందిన ఓ అభ్యర్థి పరీక్ష రాయాలంటే మూడు ప్రాంతాలకు తిరగాల్సి ఉంటుంది. మొదటి పరీక్ష కరీంనగర్ కేంద్రంలో అటెండ్ అయితే రెండో రోజు పరీక్షకు హైదరాబాద్ లోనో లేక వరంగల్ లోనో ఖమ్మం జిల్లాలోనో హాజరు కావాలి. మూడో పరిక్షకు మరో జిల్లాకు వెల్లి పరీక్ష రాయాల్సి ఉంటుంది. వరసగా ఉండే ఈ పరీక్షలు మొదటి రోజు ఓ చోట రెండో రోజు మరో చోట, మూడో రోజు ఇంకో చోట అటెండ్ కావాలని గురుకులాల ఉద్యోగాల పరీక్ష నిర్వహాణ విభాగం అధికారులు సెంటర్లను అలాట్ చేశారు. ఒకే రోజు నిర్వహించాల్సిన మూడు పరీక్షలను కూడా మూడు రోజుల పాటు కొనసాగించడమే కాకుండా మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు వెల్లాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగం పొందాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఎలా అన్న విషయంపై కసరత్తులు చేయాల్సి వస్తోంది. సాధారణ అభ్యర్థుల పరిస్థితి అయితే ఇలా ఉంటే మహిళలు, గర్భిణీలు, చిన్న పిల్లలున్న తల్లులు పరీక్షలకు మూడు ప్రాంతాలకు వెళ్లాలంటే ఎలాంటి ఇబ్బందులు పడతారో అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటిని పట్టించుకోకుకుండా గురుకులాల ఎగ్జామినేషన్ వింగ్ అధికారులు హాడావుడిగా పరీక్షలు నిర్వహిస్తున్నారో అంతు చిక్కకుండా పోతోంది. వరదలు వచ్చి రహదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్న ప్రాంతాలతో పాటు మారుమూల ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు మూడు పరీక్షలు రాసేందుకు మూడు వేర్వేరు ప్రాంతాలకు తిరగాలంటే ఎలా అని మథనపడిపోతున్నారు.

సెషన్స్ లోనూ….

ఇకపోతే ఒక్కో ఉద్యోగానికి 180 వరకు సెషన్స్ ఉండాల్సి ఉన్నప్పటికీ 70 నుండి 100 సెషన్స్ కు తగ్గించి పరీక్షలు నిర్వహిస్తున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. మరో వైపున రెండు రకాల ఎగ్జామ్స్ మాత్రం అన్ని గ్రేడుల ఉపాధ్యాయ పోస్టులకు ఒకటే రకంగా నిర్వహిస్తుండడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. హైస్కూల్ విద్యా విధానానికి, ఉన్నత విద్యా విధానానికి చాలా తేడాలు ఉన్నప్పటికీ గురుకులాల అధికారులు మాత్రం అందరికీ ఒకటే తీరు పరీక్షలు నిర్వహిస్తుండడం విడ్డూరం.

బై లాంగ్వేజ్ ఆప్షన్ ఇచ్చి…

ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన కొన్ని ఉద్యోగాల విషయంలో కూడా గురుకులాల ఎగ్జామినేషన్ వింగ్ అధికారులు నోటిఫికేషన్ లో ఓ తీరుగా పేర్కొని… తీరా పరీక్షలో మాత్రం ఒకటే భాషను ఎంచుకోవాలని సూచించడంతో అభ్యర్థులు ఖంగు తిన్నారు. నోటిఫికేషన్ లో మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలని సూచించడంతో కొంతమంది అభ్యర్థులు తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. తీరా పరీక్షా కేంద్రానికి వెల్లే సరికి ఒక్క ఇంగ్లీష్ లో మాత్రమే అనుమతిస్తామని పేర్కొనడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు అభ్యర్థులు. అసహనం వ్యక్తం చేసిన ఓ అభ్యర్థి గురుకులాలకు సంబంధించిన ఉద్యోగాల పరీక్ష నిర్వహాణ విభాగానికి ఫోన్ చేసి తన ఆవేదన వెల్లగక్కారు. ఇందుకు సంబంధించిన ఆడియో కూడా నెట్టింట్ వైరల్ కావడం గమనార్హం. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదంటూ అభ్యర్థులు అంటున్నారు. గురుకులాల అధికారులు ఈ విషయాలపై దృష్టి సారించి తమకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.

You cannot copy content of this page