కన్నీరు పెట్టిన కన్నాల బస్తీ…

మావోయిస్టు కటుకటం సుదర్శన్ కు నివాళులు

దిశ దశ, మంచిర్యాల:

మావోయిస్టు పార్టీ అగ్రనేత… తొలితరం విప్లవోద్యమ కారుడు కటుకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మృతితో ఆయన స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంచిర్యాల బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీ నివాసి అయిన సుదర్శన్ 1974లో పార్టీతో అనుభందం పెట్టుకుని విప్లవ పంథాలో పయనం అయ్యారు దాదాపు 5 దశాబ్దాల పాటు పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీలో కొనసాగి మే 31న అనారోగ్యంతో దండకారణ్య అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఈ విషయం ఆదివారం వెలుగులోకి రాగానే ఆయన స్వస్థలం అయిన బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీ వాసులు కంటతడి పెట్టారు. పట్టణంలో ఆయనకు నివాళులు అర్పించి విప్లవ పంథాలో ఆయన జీవనం సాగిన తీరుపై నెమరు వేసుకున్నారు. సుదర్శన్ మృతి పట్ల మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ తో పాటు జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఆనంద్ మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు.

You cannot copy content of this page