ఆ రోడ్ల మీదుగా వెల్తే బూడిద బ్రతుకేనా..?

దిశ దశ, పెద్దపల్లి:

కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ హైవే ఏమో కానీ… వాహనదారులు మాత్రం తెల్లబోతున్న పరిస్థితి తయారైంది. ద్విచక్ర వాహనదారుల పరిస్థితి అయితే చెప్పనవసరమే లేదు. విజయవాడ నుండి మంచిర్యాల ప్రాంతం వరకు ఈ రోడ్డు నిర్మాణం కోసం రామగుండంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన బూడిదను వినియోగించాలని కేంద్ర రవాణా శాఖ నిర్ణయించింది. దీనివల్ల ఎన్టీపీసీ వద్ద పేరుకపోతున్న బూడిద తగ్గిపోవడమే కాకుండా రోడ్డు నిర్మాణం కూడా పటిష్టంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంతవరకూ బాగానే ఉన్న బూడిద రవాణా చేస్తున్న లారీలతో వాహనం నరకం అనుభవిస్తున్నారు. ఎంతో మంచి ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు కష్టాలు పడకూడదని విస్మరించినట్లు అనిపిస్తోంది. రామంగుండం సమీపంలోని కుందన్ పల్లి శివార్లలో ఎన్టీపీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న చెరువులో బూడిద నిలువ చేసింది. అయితే ఈ బూడిద ఊబిని తలపిస్తుండడంతో అందులోకి దిగిన వారు ప్రాణాలు కోల్పోవాల్సిందే తప్ప మరో మార్గం లేదు. దీనితో ఇక్కడ NTPC ప్రత్యేకంగా రక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్న బొగ్గు వల్ల వచ్చే బూడిద దుకాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి వస్తోంది. సాధారణంగా స్థానికంగా తయారవుతున్న ఇటుక కోసం ఈ బూడిదను తరలిస్తున్నప్పటికీ లక్ష్యం మేరకు బూడిద నిల్వలు తగ్గడం లేదు. దీనితో రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తే ఎలా అన్న విషయంపై పరిశోధనలు చేయించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఫీల్డ్ హైవే గ్రీన్ కోసం బూడిదను వినియోగించుకునేందుకు ఎన్టీపీసీ అనుమతి ఇవ్వడంతో రోడ్డు కాంట్రాక్టర్, ఎన్టీపీసీ సంయుక్తంగా రవాణా చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంట్లో భాగంగా రామగుండం నుండి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల వద్దకు రామగుండం ఎన్టీపీసీ బూడిదను తరలిస్తున్నారు. ఇందు కోసం 6 ఏజెన్సీలకు అనుమతి ఇవ్వడంతో నిత్యం వందలాది లారీల్లో బూడిద రవాణా అవుతోంది.

టార్పాలెన్స్

కేంద్ర ప్రభుత్వం రోడ్డు మీద ఓవర్ లోడ్ రవాణా చేస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఆ మధ్య ఓవర్‌లోడ్ రవాణాపై వివిధ రాజకీయ నాయకులు ఆరోపణలు చేశారు. కానీ ఓవర్ లోడ్ రవాణా చేయడం మాత్రం ఆగలేదు. అయితే లారీల బాడీలను రీ డిజైన్ చేసి అదనంగా బూడిద రవాణా చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అయితే అదనంగా బాడీ సైజు చాలదన్నట్టుగా బాడీ సైజును మించి బూడిద రవాణా చేస్తున్నారు. దీంతో బూడిద రవాణా చేస్తున్న లారీల వెనుక ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లారీల నుండి బూడిద కింద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టార్పాలెన్స్ కప్పి తాళ్లతో బిగించి కట్టాల్సి ఉంటుంది. అయితే చాలావరకు లారీలకు కప్పుతున్నప్పటికీ బూడిద రోడ్లపై పడిపోతుంది. దీనివల్ల బూడిద లారీల వెనుక వెళ్లే వాహనదారులు ఉన్నారు. బైక్ వాలాలపై బూడిద పడుతుండగా, ఇతరత్రా వాహనాలపై కూడా బూడిద పడుతోంది. సాధారణ జనంపై కూడా బూడిద పడుతోంది. ఇబ్బందికరంగా మారిన బూడిద రవాణా విషయంలో మాత్రం ఎన్టీపీసీ చర్యలు తీసుకోకపోవడం వల్ల సామాన్యులు నరకం అనుభవిస్తున్నారు. ఈ బూడిద వల్ల ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు . రామగుండం నుండి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు జరుగుతున్న పాయింట్ వరకూ బూడిద లారీల వెనక వెళ్లలేక పోతున్నామని వాహనదారులు అంటున్నారు. కళ్లల్లో పడుతుండడంతో అనారోగ్యానికి గురవుతున్నామని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ, రోడ్డు కాంట్రాక్టర్ బూడిద లోడింగ్ చేస్తున్న కుందన్ పల్లి వద్ద పకడ్బందీగా చర్యలు తీసుకుంటే సరిపోదని గమ్యం చేరే వరకు జాగ్రత్తలు తీసుకోని లారీలపై కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

You cannot copy content of this page