24 గంటలు… 31 డెలివరీలు…

గుడ్ జాబ్ జనగామ ఎంసీహెచ్ టీం: హరీష్ రావు ట్విట్

దిశ దశ, జనగామ:

డ్యూటీకీ వెళ్లామా..? ఇంటికి చేరామా..? అన్నట్టుగా వ్యవహరించడం లేదు అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగం. అంకితభావంతో పని చేసి తాముఎంచుకున్న వృత్తికి సంపూర్ణంగా న్యాయం చేస్తున్నారక్కడి వైద్యులు. సర్కారు ఉద్యోగం తామేం చేసినా చెల్లుతుందన్న ధీమాతో వ్యవహరించడం లేదు వారు. ఆసుపత్రికి వచ్చిన వారిని అక్కున చేర్చుకుని సకాలంలో వైద్యం అందించడమే పనిగా పెట్టుకున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ఆసుపత్రికి మరో సారి అభినందనలు వెల్లువెత్తాయి. వైద్య మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విట్ చేసి మరీ వీరిని అభినందించారు. కేవలం 24 గంటల్లో 31 డెలివరీలు చేసిన జనగామ ఎంసీహెచ్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. గతంలో కూడా ఇదే విధమైన స్పూర్తిని అందించిన ఈ ఆసుపత్రి యంత్రాంగం తమ పనితీరును మరింత మెరుగు పర్చుకుంటూ సేవలను విస్తృతపరుస్తోంది. నిర్విరామంగా పని చేస్తున్న ప్రసూతి కోసం వచ్చిన వారికి వైద్యం అందిస్తూ… చకాచకా డెలివరీలు చేస్తూ తమ సేవా భావాన్ని చేతల్లో చూపిస్తున్నారు. దీంతో జనగామ ఆసుపత్రి వైద్యులను పలువురు గ్రేట్ సర్విసెస్ అంటూ అబినందిస్తున్నారు.

You cannot copy content of this page