ఉత్తమ్ గడ్డం ఎప్పుడు తీస్తారో…?
దిశ దశ, హైదరాబాద్:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ గడ్డం తీయనని ఒకరు… నా జిల్లా నుండి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని మరోకరు ఇలా ఛాలెంజ్ ల మీద ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. అధికార బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదనుకున్నవారంతా కాంగ్రెస్ నాయకులు చేసిన శపథాలను విని నవ్వుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే జోకులు వేశారు. ఈ అంశాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ అవేమి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తమ పంథాను నెగ్గించుకున్నారు. 2018 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తన గడ్డం తీయనని టీపీసీసీ సీనియర్ నేత ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో అప్పుడు గులాభి పార్టీ నాయకులు జోకులపై జోకులు వేసుకున్నారు. అప్పుడు ఎన్నికల తరువాత రెండో సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉత్తమ్ కుమార్ గడ్డం శపథం కూడా జోకులు కూడా పేల్చారు. అయితే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన గడ్డం ఎప్పుడు తీస్తారోనన్న చర్చ మొదలైంది. ప్రభుత్వం ఏర్పాటు తరువాత గడ్డం తీసే విషయంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కొందరు. తాజా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా జిల్లా నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరూ గెలవకుండా చేస్తానని ప్రకటించారు. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ గేట్లు కూడా ముట్టుకోనివ్వనంటూ ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసిన తరువాత కూడా చాలా మంది వ్యంగోక్తులు విసిరారు. కానీ ఆయన తన పంథాన్ని మాత్రం దాదాపు నెగ్గించుకున్నారనే చెప్పాలి. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కేవలం భద్రాచలం నుండి మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి తెల్గం వెంకట్రావు గెలిచారు. అయితే ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని తనకు టికెట్ ఇవ్వరని భావించి బీఆర్ఎస్ పార్టీలో చేరి గెలుపోందారు. అంటే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చెలామణి అయిన వారు మాత్రం ఈ సారి ఖమ్మం జిల్లా నుండి అసెంబ్లీకి అడుగు పెట్టడం లేదని పొంగులేటి వర్గీయులు అంటున్నారు. మరోవైపున భద్రాచలం నుండి గెలిచిన ఎమ్మెల్యే కూడా పొంగులేటి అనుచరుడే కావడం విశేషం.
గడ్డం బ్రదర్స్… అక్కడ..
ఇకపోతే రెండు సార్లు ఎంపీ కాకుండా నిలువరించడంలో సక్సెస్ అయిన బాల్క సుమన్ పై వివేక్ గెలివడం ఆయన అనుచరుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. పెద్దపల్లి ఎంపీగా గెలవాలన్న లక్ష్యంతో ఉన్న వివేక్ ను ఓ సారి ప్రత్యక్ష్యంగా ఓడించడం, మరో ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాకుండా ఆపడంలో బాల్క సుమన్ సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా హుజురాబాద్ బై పోల్స్ లో దమ్ముంటే నాపై పోటీ చెయ్ అంటూ బాల్క సుమన్ వివేక్ కు సవాల్ విసిరారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో చెన్నూరు నుండి వివేక్ బాల్క సుమన్ పై 37 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో వివేక్ తన ప్రత్యర్థిని ప్రజా క్షేత్రంలోనే దెబ్బ కొట్టారని ఆయన అనుచరులు అంటున్నారు. మరో వైపున ఇదే జిల్లా నుండి బెల్లంపల్లి స్థానంలో ఆయన సోదరుడు గడ్డం వినోద్ గెలిచారు. ఇద్దరు అన్నదమ్ముల్లు ఏకకాలంలో అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న రికార్డు క్రియేట్ చేసుకున్నారు. సీనియర్ నేత వెంకటస్వామి తనయులు ఇద్దరు కూడా పొలిటికల్ గా సక్సెస్ కాలేకపోతున్నారన్న విమర్శలను తిప్పికొడుతూ తాజా ఎన్నికల్లో వీరద్దరూ ఒకేసారి ఎన్నిక అయ్యారు.