లగ్గం ఎవరెవరికో తెలుసా..?
దిశ దశ, హైదరాబాద్:
ఎన్నికల వేళ వినూత్న ఆలోచనలతో ప్రచార సరళిని కొనసాగిస్తున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. ప్రధానంగా ఆ రెండు పార్టీలు ఒకటేనని ఒకరు లేదు లేదు ఆ రెండు పార్టీలే లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని మరోకరు ఇలా ఆరోపణలు చేసుకుంటూ ప్రజల్లో తమ పార్టీ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసి ఏకంగా రెండు పార్టీలకు లగ్గం కూడా చేసేస్తోంది. ఇందుకు సంబంధించిన కార్డులను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లల ఈ లగ్గం కార్డులు షేర్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ లగ్గం ఎవరెవరికంటే..?
లగ్గం వేడుక అంటూ రాసి… రాజకీయ భాగోతమే వారి ఇంట… అని ప్రింట్ చేసి మరీ లగ్గం యాడనో ఎర్కనా కేసీఆర్ ఫాం హౌజ్ లో అంటు ప్రింట్ చేయించారు. అర్సుకునేటోళ్ల జాబితాలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, అరవింద్ అని, మా పార్టీ లగ్గంను తెలంగాణ ప్రజలందరూ సూడాలే, నాకు నువ్వు బీఆర్ఎస్, నీకు నేను బీజేపీ లోపాయికారి ఒప్పందం మాది అంటూ ప్రచూరించారు. బీజేపీ, బీఆర్ఎస్ లగ్గం పిలుపు తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషతో, ముహూర్తం 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీల పెండ్లి, నక్షత్రం కవితపై కరుణ నక్షత్రంలో, పిలిశేటోల్లు మోడీ, కేసీఆర్ అండ్ మంత్రులు అని అచ్చు వేయించిన కార్డు వైరల్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతున్న ఈ కార్డు హాట్ టాపిక్ గా మారింది.
https://twitter.com/INCTelangana/status/1717121929524744281?t=bDWij08c8PMUM6YWEKwpow&s=19