కరీంనగర్ కార్పోరేషన్ లో శుద్ది కార్యక్రమం…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కార్పోరేషన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుద్ది కార్యక్రమం చేపట్టారు. గంగా జలంతో కార్యాలయ భోర్డును శుద్ది చేసిన కాంగ్రెస్ నాయకులు కార్పోరేషన్ కు పట్టిన శని విరగడైందంటున్నారు. వినూత్నంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాస్ రెడ్డి, డైరక్టర్లు రాజు, సతీష్, ఆర్ సతీష్, ముక్క భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెండి చంద్రశేఖర్ (మార్షల్), వైద్యులు అంజన్ కుమార్, ఆరీఫ్, భూమయ్య, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్షల్ మీడియాతో మాట్లాడుతూ… కార్పోరేషన్ కు గత ఐదేళ్లలో పట్టిన శని పీడ విరగడైందని శుద్ది కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్పోరేషన్ లోని ప్రతి సెక్షన్ లోనూ అవినీతి రాజ్యమేలిందని, మాజీ మేయర్ సునీల్ రావు కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. వివిధ రకాల పన్నులతో పాటు కొత్త M ట్యాక్స్ కూడా విధించారని, ఇందు కోసం ప్రైవేట్ వింగ్ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. అన్నింటా పర్సెంటేజీలు తీసుకుంటూ అవినీతికి పాల్పడిన సునీల్ రావు విచారణ జరపాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జంక్షన్ పాయింట్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలు, సుందరీకరణకు అడ్డగోలుగా ఖర్చులు చూపించారని మార్షల్ దుయ్యబట్టారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో కూడా అవినీతికి పాల్పడ్డారని, అమెరికాలో కూతురుకు ఇల్లు కట్టించాడని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజచ్ ని తట్టుకోవడం సునీల్ రావు తరం కాదని, ఆరు నెలల తరువాత ఆయనే మీడియా ముందుకు వచ్చి చెప్తారన్నారు.

You cannot copy content of this page