గన్ మిస్ ఫైర్… చికిత్స పొందుతూ పీసీ మృతి

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు స్టేషన్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్న ఈ ఘటనతో పోలీసులను అప్రమత్తం చేసింది. అయితే కానిస్టేబుల్ చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ కారణంగానే కాల్పులు చోటు చేసుకున్నాయని గమనించిన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో మంగళవారం కానిస్టేబుల్ సూర రజనీ కుమార్ (20) చేతిలోని గన్ మిస్ ఫైర్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రజనీకుమార్ నుదుటి నుండి బుల్లెట్ దూసుకెల్లడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ కానిస్టేబుల్ రజనీ కుమార్ ప్రాణా.లు గాలిలో కల్సిపోయాయని పోలీసుఅధికారులు తెలిపారు. తెల్లవారు జామున జరిగిన ఈ సంఘటనపై పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. మిస్ ఫైర్ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందా లేక సూసైడ్ చేసుకున్నాడా అన్న విషయంపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. బెల్లంపల్లి సమీపంలోని బట్వాన్ పల్లికి చెందిన కానిస్టేబుల్ రజనీ కుమార్ గుడిపేట బెటాలియన్ కు చెందిన టీఎస్ఎస్పీ బెటాలియన్ 2020 బ్యాచ్ కు ఎంపికయ్యాడు.

కానిస్టేబుల్ రజనీకుమార్ (ఫైల్ ఫోటో)

You cannot copy content of this page