బాహుబలి వంతెన నిర్మాణం

విదర్భ వేదికగా వెదురు బ్రిడ్జి

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో మరో అత్యంత ఘనతను సాధించబోతోంది. మరో అడుగు దూరంలో ఉన్న ఈ రికార్డు ప్రపంచంలో మొదటిసారి సాధించిన ఘనకీర్తిని మూటగట్టుకోబోతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా ఈ విషయన్ని ట్విట్టర్ ద్వారా వైవిద్యంగా నిర్మిస్తున్న ఈ వంతెనకు బాహుబలి అని పేరు పెట్టామని వెల్లడించారు. మహారాష్ట్రలోని విదర్భం ప్రాంతంలో వాణి, వరోరా హైవేపై 200 మీటర్ల పొడవుతో వెదురు వంతెన నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ (NATRAX)తో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల పరీక్షలు కూడా పూర్తయ్యాయి. పీతాంపూర్, ఇండోర్, రూర్కి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (CBRI) నిర్వహించిన పరీక్షల్లో ఈ వంతెనకు నెంబర్ వన్ రేటింగ్ కూడా ఇచ్చారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ గుర్తింపు కూడా పొందిన ఈ వెదురు వంతెన బంబూసా బాల్కోవా జాతిని వినియోగించారని దీనికి క్రియోసోట్ ఆయిల్ పూతలు పూశారు. రీ సైక్లింగ్ చేసిన హై డెన్సిటీ పాలీ ఇథిలీన్ (HDPE) వల్ల ఈ వంతెన ఇనుముకు సరితూగే బలాన్ని చేకూర్చుకుంటుందని అధికారులు చెప్తున్నారు. తొలిసారిగా నిర్మాణం అవుతున్న వెదురు వంతెనపై వాహనాల రాకపోకలకు అనుమించిన తరువాత టూరిస్టులను కూడా ఆకట్టుకునే అవకాశం ఉండనుంది. అంతర్జాతీయంగా కూడా విదర్భ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ బంబూ బ్రిడ్జికి ప్రత్యేక గుర్తింపు రానుంది. ఇంజనీరింగ్ నిపుణులు వెదురు యోక్క సాంద్రత, అది ఏ స్థాయి బరువులను మోసే అవకాశం ఉంది, వాటిని మరింత బలంగా తీర్చిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రయోగాలు చేసి కార్యరూపంలో పెట్టారు.

వాణి వరోరా హైవేపై నిర్మాణంలో ఉన్న వెదురు వంతెన

You cannot copy content of this page