దిశ దశ, న్యూ ఢిల్లీ:
వినియోగదారులను మోసం చేస్తే ఏమవుతుందో మరోసారి చట్టం చేతల్లో చూపించింది. పెద్ద పెద్ద సంస్థలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తే గెలుస్తామా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడడం కన్నా ఓ అడుగు ముందుకు వేస్తే సత్ఫలితం రాబట్టవచ్చని ఈ ఘటన నిరూపించింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… తమిళనాడులోని చెన్నైకి చెందిన ఢిల్లీబాబు 2021లో సన్ ఫఈస్ట్ మేరీ లైట్ బిస్కట్ కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన బిస్కట్ ప్యాకెట్ లో 16 బిస్కట్లకు బదులు 15 మాత్రమే ఉన్నాయని గుర్తించి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. లక్షల సంఖ్యలో బిస్కట్ ప్యాకెట్లు విక్రయించే సదరు కంపెనీ ఒక్కో ప్యాకెట్ లో ఒఅక్కో బిస్కట్ ను తగ్గించి వినియోగదారులను మోసం చేస్తోందని వినియోగదారుల కోర్టుకు విన్నవించాడు. దీనిపై ఐటీసీ కంపెనీ వివరణ ఇచ్చినప్పటికీ కోర్టు మాత్రం సంతృప్తి చెందకపోగా నిబంధనలకు విరుద్దంగా సంస్థ వ్యవహరించిందని తేల్చింది. అంతేకాకుండా వినియోగదారునుకి రూ. లక్ష చెల్లించాలని కూడా సదరు కంపెనీనీ చెన్నై వినియోగదారుల కోర్టు ఆదేశించింది.