ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ కు జైలు శిక్ష: ఏసీబీ కోర్టు సంచలన తీర్పు

దిశ దశ, కరీంనగర్:

పొల్యూషన్ సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఓ బాధితుడు ఏసీబీ అధికారులను అశ్రయించాడు. పుర్వాపరాలను పరిశీలించిన కరీంనగర్ ఏసీబీ కోర్టు నిందితునికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సంఘటన వివరాల్లోకి వెల్తే… నిజామాబాద్ పొల్యూషన్ బోర్డు కార్యాలయం ద్వారా క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం హరీష్ కుమార్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ ఫైలును మూవ్ చేయాలంటే డబ్బులు కావాలని అడిగాడు. దీంతో బాధితుడు 2010లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ. 25,000 లంచం తీసుకుంటుండగా ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ చంద్రకాంత్ నాయక్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసు పుర్వాపరాలు పరిశీలించిన కరీంనగర్ ఏసీబీ కోర్టు నిందితునికి 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. నిజామాబాద్ ఏసీబీ అధికారులు ఈ కేసులో ఆధారాలు సమర్పించడంతో నిందితునికి శిక్ష పడింది.

You cannot copy content of this page