శాంతి చర్చల గురించి కేంద్రంతో మాట్లాడండి…

సీఎం రేవంత్ ను కోరిన ప్రతినిధులు

దిశ దశ, హైదరాబాద్:

మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కోరారు శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంట్లో కలిసిన ప్రతినిధులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడుతూ… నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తోంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించడం లేదన్నారు. గతంలో నక్సల్స్ తో శాంతి చర్చలు జరిపిన అనుభవం ఉన్న సీనియర్ నేత జానారెడ్డికి ఉందని, ఈ అంశంపై ఆయన సలహాలు తీసుకోవడంతో పాటు సహచర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్ హర గోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాదర్, జంపన్న, రవి చందర్ లు ఉన్నారు.

You cannot copy content of this page