అర్థరాత్రి పార్టీ ఫిరాయించిన మండలి సభ్యులు…

దిశ దశ, హైదరాబాద్:

శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకునే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆరుగురు మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడం సంచలనంగా మారింది. గత రెండు మూడు రోజులుగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆరుగురు మండలి సభ్యులు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సంచలనంగా మారింది. పార్టీ ఫిరాయించిన వారిలో దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్. ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్యలు ఉన్నారు. వీరంతా కూడా ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి దీప్ దాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు.

You cannot copy content of this page