ఆత్మగౌరవ నినాదంతో కౌన్సిలర్ల రాజీనామా… నర్సంపేటలో సంచలన నిర్ణయం

దిశ దశ, వరంగల్:

ఆత్మ గౌరవ నినాదంతో బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు. పార్టీ నాయకత్వం తమను విస్మరిస్తున్న తీరు తట్టుకోలేక గులాభి పార్టీకి బైబై చెప్తున్నామని ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మునిసిపాలిటీ కౌన్సిలర్లు ఎత్తుకున్న పల్లవి సంచలనంగా మారింది. 14 మంది కౌన్సిలర్లు తమ ఆత్మగౌరవ నినాదంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి లేఖ రాసిన కౌన్సిలర్లు మునిసిపల్ ఛైర్ పర్సన్ రజినిపై గతంలో పలుమార్లు వివరించినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్న ఛైర్ పర్సన్ తీరును కట్టడి చేయడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విఫలం అయ్యారని గుర్తించి తామే అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెడితే సమన్వయం కూడా చేయలేదని మండిపడ్డారు. పెద్ది సుదర్శన్ రెడ్డి వైఖరితో తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నందున పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు 14 మంది కౌన్సిలర్లు లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్వాస రాజకీయాలతో స్థానిక సంస్థల్లో నెలకొనగా సమీకరణాలు జరపడంలో బీఆర్ఎస్ బిజీబిజీగా ఉంటే నర్సంపేటలో మాత్రం ఇంఛార్జి వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ ఏకంగా పార్టీకే రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

You cannot copy content of this page