దండకారణ్యంలో ఎదురు కాల్పులు…

ఒరిస్సా, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్లు….

దద్దరిల్లిన శబరి నది పరివాహక ప్రాంతం

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలు కీకారణ్యాలను జల్లెడ పడుతున్నాయి. రాష్ట్రంలోని సుక్మా జిల్లాతో పాటు ఒడిస్సా సరిహద్దుల్లోని శబరి నది తీరంలో కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. నక్సల్స్, బలగాల మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో 11 మంది మృత్యువాత పడ్డట్టు ప్రాథమికం సమాచారం. గురువారం ఒడిశా లని మల్కాన్ గిరి జిల్లా జినెల్ గూడ సమీపంలోని శబరి నది మీదుగా చత్తీస్ గడ్ రాష్ట్రంలోకి మావోయిస్టులు వెల్తున్నారన్న సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నక్సల్స్ కు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరగడంతో ఒక నక్సల్ మృతి చెందగా ఓ జవాన్ గాయపడినట్టుగా సమాచారం.

సుక్మా జిల్లాలో…

శుక్రవారం ఉదయం చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా కొంటా, కిష్టారం అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు… DRG, CRPF బలగాలు, బెజ్జీ పో్లీస్ స్టేషన్ పరిధిలోని కోరాజుగూడ, దంతెస్ పురం, నాగారం, భండర్ పదర్ గ్రామాల సమీపంలోని గుట్టల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు తారసపడినట్టుగా జిల్లా పోలీసు వర్గాల సమాచారం. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు చనిపోగాINSAS, AK-47, SLR ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. అయితే ఈ గుట్టల్లో ఇంకా సెర్చింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా పోలీసు వర్గాలు ప్రకటించాయి. ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని కూడా వెల్లడించాయి.

You cannot copy content of this page