దిశ దశ, దండకారణ్యం:
మహారాష్ట్ర, చత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లా భామ్రాఘడ్ తాలుకాలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. అడిషనల్ ఎస్పీ అడ్మిన్, అహేరీ అడిషనల్ ఎస్పీలకు అందిన కీలక సమాచారం మేరకు CRPF, C60, QAT యూనిట్లకు చెందిన బలగాలను దిరంగి, పుల్నార్ అటవీ ప్రాంతంలో సోమవారం కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. మంగళవారం ఉదయం మావోయిస్టుల డెన్ వద్దకు చేరుకున్న బలగాలకు, నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు జరగాయని గడ్చిరోలి జిల్లా పోలీసు వర్గాల సమాచారం. నక్సల్స్ షెల్టర్ తీసుకున్న ప్రాంతానికి భారీగా బలగాలు వచ్చాయన్న విషయాన్ని గమనించి అక్కడి నుండి తప్పించుకుని వెల్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో C60కి చెందిన ఓ జవాన్ కు గాయాలు కాగా అతన్ని చికిత్స కోసం హెలిక్యాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా మావోయిస్టు పార్టీకి చెందిన వస్తువుల, సాహిత్యం చేసుకున్నట్టుగా పోలీసు అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.