ముగ్గురు మావోయిస్టుల మృతి..?
దిశ దశ, దండకారణ్యం:
మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం తుపాకుల మోతలతో దద్దరిల్లిపోయింది. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కార్యాకలాపాలు కొనసాగుతున్నాయన్న సమచారం అందుకున్న బలగాలు రంగంలోకి దిగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భామ్రాగడ్ తాలుకా కేద్మారా అడవుల్లో ఎదురు కాల్పులు జరిగినట్టుగా పోలీసులు వర్గాల సమాచారం. మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న C-60 బలగాలకు నక్సల్స్ ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో పెరిమిలి, అహేరి దళాలు షెల్టర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు నక్సల్స్ ఏరివేత కోసం ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఎన్ కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని, పెరిమిలి దళ కమాండర్ బిట్లు మాద్వి, దళ సభ్యుడు వాసు, అహేరీ దళానికి చెందిన శ్రీకాంత్ లుగా గుర్తించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. C-60 బలగాలు తెల్లవారు జాము వరకూ కెద్మారా అటవీ ప్రాంతంలో సెర్చింగ్ కొనసాగించినట్టుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.