చత్తీస్ గడ్ లో ఎదురు కాల్పులు

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మావోయిస్టులకు, డీఆర్జీ బలగాలకు మధ్య జరిగిన ఎదుకు కాల్పుల్లో మావోయిస్టులు గాయాల పాలైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. సుక్మా జిల్లా కుంట ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారం అందుకున్న డీఆర్జీ బలగాలు అక్కడి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. కమాండర్ కోసి, మంగడు కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాడని తెలుసుకున్న జవాన్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శుక్రవారం చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ లో మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుండి మావోయిస్టులు తప్పించుకుని వెల్లిపోయారని తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురైద్గురు మావోయిస్టులు గాయాలపాలయ్యారని సుక్మా ఎస్సీ సునీల్ శర్మ వెల్లడించారు.

You cannot copy content of this page