దిశ దశ, హైదరాబాద్:
రిటైర్డ్ డీసీపీ రాధా కిషన్ రావుకు 28 గంటల పాటు కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న ఆయన తల్లి సరోజనమ్మ ఆదివారం రాత్రి కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో మరణించారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాధాకిషన్ రావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన నాంపల్లి కోర్టు రాధాకిషన్ రావుకు సోమవారం మద్యాహ్నం 2గంటల నుండి 6 గంటల వరకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనను ఈ రోజు సెక్యూరిటీ మధ్య స్వగ్రామమైన జనగామ జిల్లా పల్లగుట్టకు ఆయనను తీసుకెళ్లనున్నారు. తిరిగి మంగళవారం సాయంత్రం 6 గంటల్లోగా రాధాకిషన్ రావును చంచల్ గూడ జైలుకు తరలించాల్సి ఉంటుంది.