నిన్నొదల బొమ్మాళి… యాడ్ ఏజెన్సీకి ఝలక్ ఇచ్చిన ఆర్టీసీ

క్రిమినల్ కేసు నమోదు.. అరెస్ట్

దిశ దశ, హైదరాబాద్:

ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా యాడ్స్ వేసుకుని చెల్లించని ఓ ఏజెన్సీపై సంస్థ  సీరియన్ గా వ్యవహరించింది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకుండా చెల్లని చెక్కులు ఇచ్చిన సంస్థ నిర్వాకుడిని కటకటాలకు పంపించింది.

అసలేం జరిగిందంటే…

2015లో గో రూరల్ ఇండియా అనే సంస్థ ఆరేళ్ల పాటు టీఎస్ఆర్టీసీ 21.73 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ రీజియన్ లో రూ. 10.75 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్ లో రై. 10.98 కోట్లతో ఒప్పందం చేసుకున్న సదరు సంస్థ 2021 వరకు అగ్రిమెంట్ చేసుకుంది. కానీ టీఎస్ఆర్టీసీకి మాత్రం గో రూరల్ ఇండియా యాడ్ ఏజెన్సీ మాత్రం డబ్బులు చెల్లించలేదు. దీంతో సదరు సంస్థకు పలు మార్లో ఆర్టీసీ లీగల్ నోటీసులు పంపించగా రూ. 55 లక్షలకు గాను చెక్కులను ఇచ్చింది. దీంతో ఆర్టీసీ అధికారులు అప్జల్ గంజ్, మారేడుపల్లి స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో గో రూరల్ ఇండియా యాడ్ ఏజెన్సీపై క్రిమినల్ కేసు నమోదయింది. ఈ కేసును దర్యాప్తు చేసిన సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు సదరు యాడ్ ఏజెన్సీ నిర్వహాకుడు వి. సునీల్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు. సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని బకాయిలో ఎగవేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఇలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో వెనకాడేది లేదని లేదని వెల్లడించింది.

స్పెషల్ ఆపరేషన్…

ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ తనదైన స్టైల్లో ఆఫరేషన్ నిర్వహిస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంస్థను కాపాడేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సంస్థకు ఉన్న బకాయిల వసూళ్లపై కూడా దృష్టి సారించారు.

You cannot copy content of this page