ఎస్ఐబీ ఆఫీసు ఘటనపై క్రిమినల్ కేసు నమోదు…

డీఎస్పీ ప్రణిత్ రావు సహా పలువురిపై ఫిర్యాదు…

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఎస్ఐబి) అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న డీఎస్పీ ప్రణిత్ రావుతో పాటు మరికొంత మంది పోలీసు అధికారులపై ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి రమేష్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఐపీసీ 409, 427, 201, 120(బి), పీడీపీపీ, ఐటీ యాక్ట్ సెక్షన్లలో కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లలో పోలీసు విభాగానికి చెందిన అధికారులపై క్రిమినల్ కేసులు కావడం సంచలనంగా మారింది. ఎస్ఐబి కార్యాలయంలో కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు ధ్వంసం చేయడం, ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ లోకి ఎస్ఐబీ కార్యాలయంలోని రహస్య సమాచారాన్ని సేకరించారని అదనపు ఎస్పీ డి రమేష్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీ కెమెరాలను ఆఫ్ చేసి సాక్ష్యాలను తారుమారు చేశారని, ఈ వ్యవహారంలో ప్రణీత్ రావుతో పాటు అతనికి సహకరించిన అధికారులపై పిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.

You cannot copy content of this page