ఎమ్మెల్యేలే టార్గెట్..!

దిశ దశ, కరీంనగర్:

నేరగాళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలే టార్గెట్ చేసుకున్నారా..? అందునా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలనే లక్ష్యం చేసుకున్నారా..? క్రిమినల్స్ వ్యవహరిస్తున్న తీరు దేనికి సంకేతం..? వెలుగులోకి వచ్చిన ఈ వరస ఘటనలతో పోలీసులు హై అలెర్ట్ గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొద్ది రోజుల క్రితం…

అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన అంగతకుడు అతని ఫ్యామిలీ మొత్తాన్ని అంతం చేస్తానని హెచ్చిరించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి నిందితుడిని గుర్తించే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. అత్యంత రహస్యంగా పోలీసులు ఈ ఎమ్మెల్యేకు కాల్ చేసి హెచ్చరించిన కేసును దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేసినట్టుగా సమాచారం.

తాజాగా…

తాజాగా కరీంనరగ్ ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు అర్థరాత్రి న్యూడ్ కాల్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఈ నెల 14వ తేది తెల్లవారు జామున 2 గంటల 2 నిమిషాలకు సదరు ఎమ్మెల్యేకు వీడియో కాల్ రావడంతో ఆయన లిఫ్ట్ చేశారు. కాల్ చేసిన అగంతకులు న్యూడ్ వీడియో ప్రదర్శించడంతో ఖంగుతిన్న ఆయన వెంటనే కాల్ కట్ చేశారు. ఈ నెల 17న హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 67A ITA 2000-2008 సెక్షన్ పై కేసు నమోదు చేసిన సైబర్ వింగ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

You cannot copy content of this page