కాకినాడ వద్ద క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు


ONGC ఆపరేషన్ సక్సెస్

దిశ దశ, ఏపీ బ్యూరో:

గోదావరి నదిలో ONGC చేపట్టిన అన్వేషణ సత్ఫలితాలు ఇస్తోంది. ఇప్పటి వరకు గ్యాస్ నిక్షేపాలను మాత్రమే గుర్తించగా తాజాగా క్రూడ్ ఆయిల్ కూడా లభ్యం కావడం విశేషం. క్రూడ్ ఆయిల్ కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్న భారతదేశానికి ఓఎన్జీసీ సర్వే గుడ్ న్యూస్ చెప్పింది. 2016-17 నుండి చేపట్టిన అన్వేషణ కోవిడ్ కారణంగా ఆలస్యం అయింది. కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో 98/2 కృష్ణా, గోదావరి బేసిన్ సమీపంలోని బంగాళాఖాతంలో క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు గుర్తించారు. 26 బావుల ద్వారా క్రూడ్ ఆయిల్ వెలికితీసే పనికి శ్రీకారం  చుట్టిన  ఓఎన్జీసీ ఈ ఏడాది మే, జూన్ వరకు రోజుకు 45 వేల బ్యారెళ్ల  వరకు ఉత్పత్తి చేయనుంది.

 

You cannot copy content of this page