గుజరాత్ కేంద్రంగా సైబర్ నేరాల మాఫియా… నిందితుల్లో సీఏ…

దిశ దశ, హైదరాబాద్:

సైబర్ నేరాలకు పాల్పుడుతున్న ముఠాలను పట్టుకోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేళ్లూనుకుని ఉన్న క్రిమినల్స్ ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుని అమాయకుల అకౌంట్ల నుండి రూ. కోట్లు దోచుకుంటున్న ముఠాల వేటాడి పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన సైబర్ క్రిమినల్స్ గ్యాంగ్ ను ట్రేస్ పట్టుకోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సక్సెస్ అయింది. ఒకటి కాదు రెండు కాదు దేశ వ్యాప్తంగా ఈ ముఠా వెయ్యికి పైగా నేరాల్లో పాల్గొన్నట్టుగా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇన్వెస్టిమెంట్, ఫెడిక్స్, ట్రేడింగ్ ద్వారా ఛీటింగ్ చేస్తున్న ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నేరాలకు పాల్పడి చట్టానికి చిక్కమన్న ధీమాతో వ్యవహరించిన వారి భరతం పట్టారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 36 మంది నిందితులను పట్టుకోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ సక్సెస్ అయింది. తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ముఠా 20 నేరాలకు పాల్పడిన ఈ ము4 కోట్లఠా రూ. 12 కోట్ల వరకు దోచుకుందని, అందులో రూ. 4.4 కోట్ల వరకు ఫ్రీజ్ చేశారు. ఇందులో బాధితులకు రూ. 1.50 కోట్లు అందజేసినట్టు కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. ఈ ముఠాలో సీఏ కూడా ఉండడం పోలీసు అధికారులను విస్మయపర్చింది. అదే వృత్తిలో స్థిరపడినట్టయితే ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా వక్రమార్గాన్ని ఎంచుకున్న తీరే అందరిని ఆశ్చర్యపర్చింది. ఉన్నత చదువులు, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి సక్రమ మార్గంలో కాకుండా అడ్డదారులను ఎంచుకుని డబ్బు సంపాదించాలన్న ఆశే వారిని నేరాల వైపునకు తీసుకెల్తోందని అదికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ సైబ్యర్ సెక్యూరిటీ బ్యూరో మాత్రం దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసుల కంటే ఎక్కువ వేగంగా సైబర్ నేరాల పరిశోధనపై దృష్టి సారించినట్టుగా స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page