దిశ దశ, కరీంనగర్:
కమిషన్ వస్తుందని ఆశపడి జైలు పాలయ్యాడొకరు. కూర్చున్న చోటకు డబ్బులు చేతులో పడుతున్నాయని… తనకిక ఢోకా లేదనుకున్న ప్రబుద్దుడు ఒకరిని వేరే రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన వివరాల్లోకి వెల్తే… పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మోసిన్ కమాల్ అనే వ్యక్తి, తెలంగాణ లోని మరో మహిళ అగంతకుని వలలో పడి మోసపోయారు. కరీంనగర్ కు చెందిన ఓ మహిళకు జులై 16న అగంతకుడు ఫోన్ చేశాడు. ఆన్ లైన్ రివ్యూ ద్వార ఉపాధి పొందవచ్చని అగంతకుడు సూచించడంతో ఆమె సమ్మతించారు. ఆన్ లైన్ ద్వారా అగంతకుడు ఆమెకు కొన్ని రివ్యూలు చేయాలని సూచించడంతో బాధితురాలు వాటిని ఫుల్ ఫిల్ చేశారు. బాధితురాలికి విశ్వాసం కలిగించేందుకు అగంతకుడు రివ్యూలు కంప్లీట్ చేశారని డబ్బులు పంపించారు. దీంతో ఆమెకు నమ్మకం ఏర్పడిందని గ్రహించిన అగంతకుడు మీకు టాస్క్ ఇస్తామని దీంతో డబ్బులు ఎక్కవ గడించే అవకాశం ఉంటుందని వివరించారు. అంతేకాకుండా కొంత డబ్బు కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పాడు. ఇందుకు సమ్మతించిన బాధితురాలికి అగంతకుడు ఓ నెంబర్ సూచించడంతో ఆ నెంబర్ కు డబ్బులు పంపించారు. ఇందుకు అవతలి వ్యక్తి కూడా టాస్క్ కంప్లీట్ చేయాలని సూచించడంతో బాధితురాలు ఈ మేరకు టాస్క్ పూర్తి చేశారు. అయితే ఆమె అకౌంట్ కం డబ్బులు జమ కాకపోవడంతో అతన్ని అడగగా తాము పంపిన టాస్క్ లో కొన్ని తప్పులు చేశారని, మరికొన్ని డబ్బులు పంపిస్తే టాస్క్ కంప్లీట్ చేసినందుకు ఇస్తామన్న డబ్బులు పంపిస్తామని చెప్పారు. ఇలాంటి సాకులు చూపిస్తూ బాధితురాలి వద్ద రూ. లక్షా 9 వేల 140 వసూలు చేసిన అగంతకుడు ఆమెను మోసం చేశాడు. తాను అగంతకుని వలలో పడి మోసపోయానని గుర్తించిన ఆమొ కరీంనగర్ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కరీంనగర్ పోలీసులు స్టేట్ సైబర్ సెక్యూరిటి వింగ్ సహాయంతో పశ్చిమ బెంగాల్ కు చెందిన మోసిన్ కమల్ (35)కం సంబంధించిన అకౌంట్ వివరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పశ్చిమ బెంగాల్ కు చెందిన మోసిన్ కమల్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి తనను సంప్రదించి బ్యాంకు అకౌంట్ వివరాలు ఇస్తే రెండు నెలలకు రూ. 15 వేల చొప్పున కమిషన్ ఇస్తానని చెప్పడంతో తన వివరాలన్ని కూడా ఇచ్చానని మోసిన్ కమల్ వివరించారు. దీంతో పోలీసులు మోసిన్ కమల్ ను అరెస్ట్ చేశారు.
సోమ్ము ఒకరిది..
కరీంనగర్ కు చెందిన బాధితురాలి నుండి డబ్బులు వసూలు చేసుకున్న అగంతకుడు మరోకరి అకౌంట్ కు బదిలీ చేసుకుని తన లక్ష్యం నెరవేర్చుకున్నాడు. మాయ మాటలు చెప్పి మోసం చేసిన ప్రబుద్దుడు చట్టాలకు చిక్కకుండా తప్పించుకునేందుకు మరోకరి అకౌంట్ వాడుకున్నాడు. దీంతో అటు బాధితురాలు డబ్బులు పనష్ట పోగా, కమిషన్ కోసం కక్కుర్తి పడ్డందుకు మోసిన్ కమల్ అరెస్ట్ కావల్సి వచ్చింది.
అప్రమత్తత అవసరం: సీపీ సుబ్బరాయుడు
ఇలాంటి సైబర్ క్రైమ్స్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు అన్నారు. అగంతకుల కాల్స్ కు స్పందించకపోవడం చాలా వరకు మంచిదన్నారు. తెలియని వ్యక్తులు ఉపాధి పేరిట ఎరవేసి నిండా ముంచుతున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. సైబర్ నేరాన్ని పరిశోధించడంలో కీలకంగా పని చేసిన వారిని ఈ సందర్భంగా సీపీ అభినందించారు